భార్య-భర్తల మధ్య మ్యాప్ లోకేషన్ చిచ్చు..!

|

May 22, 2020 | 3:32 PM

తమిళనాడులో గూగుల్ మ్యాప్ పండంటి కాపురంలో నిప్పులు పోసింది. వెళ్లని ప్రాంతానికి వెళ్లావంటూ.. భర్తను ఇంటి నుంచి గెంటేసేంత పని చేసింది. దీంతో చేసేదీ లేక పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను వెళ్లని ప్రదేశాలకు వెళ్లినట్లు చూపించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మయిలదుత్తురాయిలోని లాల్‌బహదూర్‌ నగర్‌కు చెందిన ఆర్‌ చంద్ర శేఖరన్‌ ప్రతి రోజు ఆఫీస్‌ నుంచి ఇంటికి రాగానే తన భార్య […]

భార్య-భర్తల మధ్య మ్యాప్ లోకేషన్ చిచ్చు..!
Follow us on

తమిళనాడులో గూగుల్ మ్యాప్ పండంటి కాపురంలో నిప్పులు పోసింది. వెళ్లని ప్రాంతానికి వెళ్లావంటూ.. భర్తను ఇంటి నుంచి గెంటేసేంత పని చేసింది. దీంతో చేసేదీ లేక పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు.
తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను వెళ్లని ప్రదేశాలకు వెళ్లినట్లు చూపించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మయిలదుత్తురాయిలోని లాల్‌బహదూర్‌ నగర్‌కు చెందిన ఆర్‌ చంద్ర శేఖరన్‌ ప్రతి రోజు ఆఫీస్‌ నుంచి ఇంటికి రాగానే తన భార్య చేతికి ఫోన్‌ ఇచ్చేవాడు. దీంతో తన భర్త రోజు ఎక్కడికెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలిన భావించింది. ఇదే అదునుగా ఆమె.. గూగుల్‌ మ్యాప్స్‌లోని యువర్‌ టైమ్‌లైన్ సెక్షన్‌లోకి వెళ్లింది. అతడు రోజంతా ఎక్కడ తిరిగాడో చెక్‌ చేసేది. ఈ క్రమంలో ఓ రోజు గూగుల్‌ మ్యాప్స్‌ టైమ్‌లైన్‌లో అతడు వెళ్లని ప్రదేశాలకు బదులు వేరే ప్రాంతాలను చూపించింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమయ్యింది. ఆఫీసు పేరుతో ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్నావంటూ వాదులాటకి దిగింది. భర్త ఎంత చెప్పిన నమ్మకంపోగా, మరింత అనుమానం పెంచుకుంది. దీంతో విసుగు చెందిన చంద్రశేఖరన్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. మే 20 గూగుల్‌ మ్యాప్‌ టైమ్‌లైన్‌లో చూపించిన ప్రాంతాలకు నేను ఇంతవరకు వెళ్లలేదన్నాడు చంద్రశేఖరన్. ఇలాంటి తప్పుడు సమాచారం వల్ల మా పచ్చని కాపురంలో నిప్పులు పోశాయని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.