Tsunami: స్మరిస్తూ… విలపిస్తూ… నివాళులు అర్పిస్తూ… సముద్రానికి పూజలు చేస్తూ…

సరిగ్గా 16 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామి భారతదేశాన్ని కకావికలం చేసింది. హిందూ మహా సముద్రంలో సుమత్రా, ఇండోనేషియా దేశాలకి దక్షిణ తీరం కేంద్రంగా ఏర్పడిన సునామీ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ప్రజలను వేలల్లో పొట్టన పెట్టుకుంది.

Tsunami: స్మరిస్తూ... విలపిస్తూ... నివాళులు అర్పిస్తూ... సముద్రానికి పూజలు చేస్తూ...

Edited By:

Updated on: Dec 26, 2020 | 12:19 PM

సరిగ్గా 16 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామి భారతదేశాన్ని కకావికలం చేసింది. హిందూ మహా సముద్రంలో సుమత్రా, ఇండోనేషియా దేశాలకి దక్షిణ తీరం కేంద్రంగా ఏర్పడిన సునామీ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ప్రజలను వేలల్లో పొట్టన పెట్టుకుంది. అంతే కాకుండా14 దేశాల్లో సుమారు 2,30,000 మందిని బలి తీసుకుంది. ప్రపంచలోనే అత్యంత ఘోరవిపత్తుల్లో ఒకటిగా నిలిచిపోయింది.

 

ఈ సునామిలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన దాదాపు 5 వేల మంది చనిపోయారు. దీంతో ఆ రాష్ట్ర ప్రజలు ప్రతీ ఏటా డిసెంబర్ 26న సముద్ర తీరాన చనిపోయిన వారివారి బంధువులకు నివాళులు అర్పిస్తారు. అంతేకాకుండా సముద్రానికి పూజలు సైతం చేస్తారు. ఈ క్రమంలోనే 2020 డిసెంబర్ 26న ఆ పెను విషాదానికి 16 ఏళ్లు నిండిన సందర్భంగా చెన్నైలోని మెరీనా బీచ్‌లో మ‌ృతులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. సముద్రానికి పూలతో పూజలు చేశారు.