AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : విజయ్‌ సేతుపతి తప్పుకున్నాడు

శ్రీలంక మాజీ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ 800 సినిమా నుంచి తమిళనటుడు విజయ్‌ సేతుపతి తప్పుకున్నారు. ముత్తయ్య మురళీధరన్‌ తమిళ జాతికి ద్రోహం చేశాడని, అలాంటి వ్యక్తిపై తీస్తున్న సినిమాలో నటించవద్దని తమిళనాడులో నిరసనలు వెలువెత్తాయి...

Breaking News : విజయ్‌ సేతుపతి తప్పుకున్నాడు
Sanjay Kasula
|

Updated on: Oct 19, 2020 | 6:55 PM

Share

Vijay Sethupathi pulls out : ఆఖరికి తప్పుకున్నారు.. మురళీధరన్ సూచనను పాటించారు. శ్రీలంక మాజీ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ 800 సినిమా నుంచి తమిళనటుడు విజయ్‌ సేతుపతి తప్పుకున్నారు. ముత్తయ్య మురళీధరన్‌ తమిళ జాతికి ద్రోహం చేశాడని, అలాంటి వ్యక్తిపై తీస్తున్న సినిమాలో నటించవద్దని తమిళనాడులో నిరసనలు వెలువెత్తాయి.

లంకలో తమిళుల ఊచకోతపై ఏనాడు మాట్లాడని వ్యక్తికి సంబంధించిన సినిమాలో ఎలా నటిస్తారని విజయ్‌ సేతుపతిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ కూడా జరిగింది. ముత్తయ్య మురళీధరన్‌ కూడా తన బయోపిక్‌ నుంచి తప్పుకోవాలని విజయ్‌ సేతుపతికి సూచించాడు. మురళీధరన్‌ చెప్పిన గంట లోపే సినిమా నుంచి తప్పుకున్నారు విజయ్‌ సేతుపతి.

విజయ్‌ సేతుపతికి తమిళంలోనే కాదు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్‌ ఉంది.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తోనే ప్రశంసలు అందుకున్న నటుడు విజయ్‌ సేతుపతి.. ఏ పాత్ర పోషిస్తే ఆ పాత్రలోకి దూరిపోతాడాయన.. బయోపిక్‌ కోసం మురళీధరన్‌లో పాత్రలో కూడా పరకాయ ప్రవేశం చేసినట్టు అనిపించింది. ఆయన లుక్‌ అద్భుతం.. అంతా బాగానే ఉంది కానీ మురళీధరన్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి నటించడమే నెటిజన్‌లకు నచ్చలేదు..

ఆ కోపంతోనే షేమ్‌ఆన్‌ విజయ్‌సేతుపతి అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌ ఓ ట్రెండింగ్‌ మొదలు పెట్టారు. ఇందుకు కారణం.. శ్రీలంక ప్రభుత్వం మొదటి నుంచి తమ దేశంలోని తమిళులను అణచివేయడమే! వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా చూడటమే.. అలాంటి దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెట్‌ పాత్రలో విజయ్‌సేతుపతి నటించడమేమిటి? ఇదేనా తమిళ ప్రేక్షకుల పట్ల మీరు చూపే కృతజ్ఞత అంటూ నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు. విజయ్‌ సేతుపతి మీరు చేస్తున్నది తప్పు అంటూ ట్రోల్‌ చేశారు. సినిమా రూపకర్తలు మాత్రం ఈ విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు..

తాము తీసే బయోపిక్‌ ఆద్యంతమూ ఆసక్తికరంగా .. అద్భతుంగా ఉంటుందని ప్రచారం చేసుకున్నారు. బయోపిక్‌లో ఎక్కడా అసత్యాలు ఉండవని, అభూత కల్పనలు అసలే ఉండవని చెప్పుకొచ్చారు. మురళీధరన్‌ జీవితంలో జరిగిన ఘటనలను ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తామని చెప్పుకున్నారు. ముత్తయ్య మురళీధరన్‌ జీవితంలోని మనకు తెలియని అనేక కోణాలను తెరమీదకు తెస్తామని ప్రచారం చేసుకున్నారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఆ చిత్రం నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవడం ఇప్పుడుపై పెద్ద చర్చ జరుగుతోంది.