నాడు రష్మిక.. నేడు తమన్నా.. స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు టార్గెట్‌గా మారారు!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ క్రేజే వేరు. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత మాస్‌లో ఆ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకరు. అంతేకాక తమ అభిమాన హీరోను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే.. వారు సారీ చెప్పేవరకు వదలరు దళపతి ఫ్యాన్స్. అలాంటి వారికి తమన్నా అడ్డంగా దొరికిపోయింది. ఆమె తమిళంలో నటించిన ‘పెట్రోమాక్స్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్ గురించి ఓ చిన్న మాట చెప్పండి అని ఇంటర్వ్యూవర్ ప్రశ్నించగా.. ఆయన […]

నాడు రష్మిక.. నేడు తమన్నా.. స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు టార్గెట్‌గా మారారు!
Follow us

|

Updated on: Oct 13, 2019 | 1:04 AM

కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ క్రేజే వేరు. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత మాస్‌లో ఆ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకరు. అంతేకాక తమ అభిమాన హీరోను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే.. వారు సారీ చెప్పేవరకు వదలరు దళపతి ఫ్యాన్స్. అలాంటి వారికి తమన్నా అడ్డంగా దొరికిపోయింది. ఆమె తమిళంలో నటించిన ‘పెట్రోమాక్స్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్ గురించి ఓ చిన్న మాట చెప్పండి అని ఇంటర్వ్యూవర్ ప్రశ్నించగా.. ఆయన గురించి నాకు పెద్దగా తెలియదని చెప్పేసేంది. ఇద్దరం కలిసి ఒక సినిమాలో నటించినా… ఆ సమయంలో పెద్దగా కమ్యూనికేషన్ జరగలేదు. అలాంటప్పుడు ఆయన గురించి ఏమి తెలియకుండా ఎలా కామెంట్ చేయగలను అంది. అంటే ఈ మాటలకు విజయ్ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. గొప్ప స్టార్ హీరోను పట్టుకుని.. ఎవరో తెలియదని నీవు చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ తమన్నాను సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు. తెలుగు, తమిళంలో ఇప్పుడిప్పుడే కెరీర్‌ను గాడిలో పెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తమన్నా.. ఈ సమయంలో విజయ్ ఫ్యాన్స్‌కు బుక్కయ్యింది.

అటు కన్నడ కస్తూరి రష్మిక మందన్నా కూడా తనకు తెలియకుండానే ఇటువంటి ప్రాబ్లెమ్‌లో పడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా చేస్తున్న ఈ బ్యూటీ.. రీసెంట్‌గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన దసరా స్పెషల్ లుక్‌ని గానీ, సినిమాను గానీ, మహేష్ పేరును గానీ సోషల్ మీడియాలో ప్రస్తావించకపోవడంతో.. ఆయన ఫ్యాన్స్ రష్మికపై ఫైర్ అవుతున్నారు. ‘రష్మికా.. నిద్రపోతున్నావా’ అంటూ నెట్టింట్లో విరుచుకుపడుతున్నారు. స్టార్ హీరోయిన్లు అయ్యుండీ… నోరు జారితే వెనక్కి తీసుకోలేమన్న చిన్న విషయాన్ని ఎలా మరిచిపోతున్నారో తెలియట్లేదు.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు