Afghan Crisis: భారత ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ మృతదేహాన్ని రెడ్ క్రాస్ కి అప్పగించిన తాలిబన్లు…
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లకు. ఆ దేశ భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న పోరులో భారత ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ మరణించారు..
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లకు. ఆ దేశ భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న పోరులో భారత ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ మరణించారు..ఆయన మృతదేహాన్ని తాలిబన్లు రెడ్ క్రాస్ కి అప్పగించారు. కాందహార్ లో ఉభయ పక్షాల మధ్య జరుగుతున్న పోరును కవర్ చేస్తున్న సిద్దిఖీ..నిన్న మృతి చెందాడు. ఆయన డెడ్ బాడీని తాలిబన్లు రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీకి అప్పగించినట్టు కాబూల్ లోని భారత ఎంబసీ ధృవీకరించింది. కాందహార్ లోని స్పిన్ బోల్డక్ ప్రాంతంలో తాలిబన్లు, సెక్యూరిటీ దళాల మధ్య నిన్నభీకర పోరు జరిగింది. ఆఫ్ఘన్ స్పెషల్ ఫోర్సెస్ తో తనకు అప్పగించిన విధులను నిర్వహిస్తుండగా సిద్దిఖీ కాల్పులకు గురయ్యారు. ఆయన మృత దేహాన్ని తిరిగి తీసుకువచ్చే విషయంలో తాము ఆఫ్ఘన్ అధికారులను సంప్రదిస్తున్నట్టు ఇండియన్ ఎంబసీ వెల్లడించింది.కాగా ఆయన కుటుంబంతో తాము టచ్ లో ఉన్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాఘ్చి తెలిపారు.
పులిట్జర్ అవార్డు గ్రహీత అయిన సిద్దిఖీ టీవీ కరెస్పాండెంట్ గా తన కెరీర్ ఆరంభించి తరువాత ఫోటో జర్నలిజం వైపు మొగ్గారు. పలు మీడియా, టీవీ సంస్థలకు ఫోటో జర్నలిస్టుగా వ్యవహరించారు. 2008 నుంచి 2010 వరకు ఓ భారతీయ మీడియా సంస్థకు కరెస్పాండెంట్ గా పని చేశారు. ఆయన మృతి పట్ల ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపింది. అటు ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల జోరు హెచ్చింది. పలు జిల్లాలను వారు తమ హస్తగతం చేసుకుంటున్నారు. అమెరికా, నేటో దళాల ఉపసంహరణ ప్రారంభమైనప్పటి నుంచి వారు దేశంలో పలు ప్రాంతాలను వశపరచుకుంటున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా వచ్చే సెప్టెంబరు నాటికి ఆఫ్ఘన్ లో మిగిలి ఉన్న తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంటుందా అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
‘సారీ ! ఆ ఫోటోజర్నలిస్టు మృతిలో మా ప్రమేయం లేదు..తాలిబన్ల ప్రకటన:
కాందహార్ లో తమకు, ఆఫ్ఘనిస్తాన్ దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఫోటోజర్నలిస్టు డానిష్ సిద్దిఖీ మృతికి తాలిబన్లు విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతిలో తమ పాత్ర లేదని, ఆయన ఎవరి కాల్పుల్లో మరణించాడో తమకు తెలియదని వీరి అధికార [ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్ అన్నారు. అసలు వార్ జోన్ (యుద్ధ భూమి) లోకి ఏ జర్నలిస్టు ప్రవేశించినా ముందు తమకు ఆ సమాచారం తెలియజేయాలని, అప్పుడు ఆ వ్యక్తి పట్ల తాము తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన చెప్పాడు. ఈ ఫోటోజర్నలిస్టు ఇలా ఎవరికైనా సమాచారం ఇచ్చాడో, లేదో తమకు తెలియదన్నారు. ఈ ఘర్షణల్లో సిద్దిఖీతో బాటు ఆఫ్ఘన్ అధికారి ఒకరు కూడా మృతి చెందారు. స్పిన్ బోల్తాక్ ప్రాంతాన్ని తాలిబన్ల నుంచి తిరిగి తాము స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ మరణాలు సంభవించి ఉండవచ్చునని అఫ్గాన్ కమాండర్ పేర్కొన్నారు. ఫోటోజర్నలిస్టు మరణం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Heartbroken. Danish Siddiqui was supremely talented. A friend & someone who rightly ditched TV to embrace his true love, photography. Won a Pulitzer. Spoke to him just weeks ago for ? for my next book. Quiet & brave. Deepest condolences to his young family. Farewell, Danish. pic.twitter.com/vHSMl7Wqqm
— Shiv Aroor (@ShivAroor) July 16, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: Luxury Car Smuggling Racket: లగ్జరీ కార్లపై సుంకం ఎగవేత వ్యవహారం గుట్టురట్టు.. ఆరు కార్లు స్వాధీనం
Warning: యమ డేంజర్ : ఉపద్రవం ఎంతో దూరం లేదు .. దశ ఆల్రెడీ స్టార్టైపోయిందట. బి కేర్ ఫుల్.!