
ఓ ఆకతాయి తనను అసభ్యంగా తాకాడని.. దాంతో వాడి వేలు విరిచేశానని చెప్పుకొచ్చింది తాప్సీ పన్ను. ప్రస్తుతం వరుస సినిమాలతో విజయం సాధిస్తూ ముందుకు దూసుకువెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ‘తప్పడ్’ సినిమాతో మన ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తనకు జరిగిన ఓ సంచలన నిజాన్ని వెల్లడించింది. నిజానికి ఆ ఘటనతోనే తాను దృఢంగా మారినట్టు చెప్పుకొచ్చింది.
మా ఫ్యామిలీతో కలిసి అప్పుడప్పుడు ఢిల్లీలోని గురుద్వార్‌కి వెళ్తుంటామని, ఒకానొక సమయంలో ఆ గుడిలో బాగా రద్దీ ఉంటుంది. ఒకసారి అక్కడ విపరీతమైన రద్దీ ఏర్పడిందని, అదే అదునుగా భావించిన ఓ ఆకతాయి.. తనపై చేతులు వేసి ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తన మరీ హద్దు మీరడంతో.. వెంటనే వాడి చేయి పట్టుకుని వేళ్లు విరిచేశానని చెప్పింది. ఆ సంఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేనని, ఇలాంటివి చేయడానికి చాలా మంది భయపడతారు. అలా చేస్తే ఆ ఆకతాయిలు ఇంకా రెచ్చిపోతారని వారికి సరైన బుద్ధి చెప్పాలని తాప్సీ పేర్కొంది.