టీ20 ప్రపంచకప్ వాయిదా.. పాకిస్థాన్ గరం.. గరం..!

అందరూ అనుకున్నట్టుగానే టీ 20 ప్రపంచకప్ వాయిదా పడుతుందా? పడితే ఎప్పుడు జరుగుతుంది? అన్న సందేహాలకు ఇవాళ తెరపడుతుంది.. టీ 20 వరల్డ్ కప్ సంగతే కాదు.. ఐపీఎల్ భవితవ్యం ఏమిటో ఈరోజు తేటతెల్లం కానుంది.. ఈ రెండింటిపై ఐసీసీ బోర్డు సమావేశం స్పష్టత ఇవ్వనుంది.. నిజానికి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని దేశాలు లాక్ డౌన్ ను విధించుకున్నాయి.. ఎక్కడా ఎలాంటి యాక్టివిటీ జరగడం లేదు.. రెండు నెలల నుంచి ఆటలు జరగడం […]

టీ20 ప్రపంచకప్ వాయిదా.. పాకిస్థాన్ గరం.. గరం..!

Edited By:

Updated on: May 28, 2020 | 12:17 PM

అందరూ అనుకున్నట్టుగానే టీ 20 ప్రపంచకప్ వాయిదా పడుతుందా? పడితే ఎప్పుడు జరుగుతుంది? అన్న సందేహాలకు ఇవాళ తెరపడుతుంది.. టీ 20 వరల్డ్ కప్ సంగతే కాదు.. ఐపీఎల్ భవితవ్యం ఏమిటో ఈరోజు తేటతెల్లం కానుంది.. ఈ రెండింటిపై ఐసీసీ బోర్డు సమావేశం స్పష్టత ఇవ్వనుంది.. నిజానికి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని దేశాలు లాక్ డౌన్ ను విధించుకున్నాయి.. ఎక్కడా ఎలాంటి యాక్టివిటీ జరగడం లేదు.. రెండు నెలల నుంచి ఆటలు జరగడం లేదు.. క్రికెట్ పోటీలు అస్సలు జరగడం లేదు.. టోర్నమెంట్ల సంగతి దేవుడెరుగు.

ద్వైపాక్షిక సిరీస్ లే జరగడం లేదెక్కడా… ఇవి కూడా ఇప్పట్లో జరిగేలా లేవు.. ఐపీఎల్ వాయిదా పడింది.. ఈ ఏడాది చివర్లో జరగాల్సిన టీ 20 వరల్డ్ కప్ కూడా జరిగేట్టు లేదు.. కారణం కరోనా వైరస్ వ్యాప్తి తగ్గకపోవడమే…ఈ విషయంపై ఐసీసీ ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. ఇవాళ జరిగే బోర్డు సమావేశంలో తేల్చేయబోతున్నది. టీ 20 వరల్డ్ కప్ వాయిదా పడితే ఐపీఎల్ టోర్నమెంట్ ను కండక్డ్ చేయాలన్న ఆలోచనతో బీసీసీఐ ఉంది. ఈ విషయమై సభ్య దేశాల నుంచి మద్దతు సంపాదించే పనిలో పడింది. షెడ్యూల్ ప్రకారం అయితే ఆస్ట్రేలియాలో అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు వరల్డ్ కప్ జరగాలి… అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అంతకంతకూ పెరుతుండటంతో టోర్నమెంట్ ను నిర్వహించడం అసాధ్యంగా కనిపిస్తోంది.. ఖాళీ స్టేడియంలలో పోటీలను నిర్వహించడం కూడా కష్టమే… ఇప్పుడు క్రికెట్ డబ్బుతో ముడిపడిన వ్యవహారం కాబట్టి ప్రేక్షకులు లేకుండా మ్యాచులను నిర్వహించడాన్ని ఐసీసీ కూడా ఒప్పుకోదు. అయితే ఈ మెగా టోర్నమెంట్ కనుక వాయిదా పడితే వేసవిలో నిర్వహించలేకపోయిన ఐపీఎల్ ను అక్టోబర్ నవంబర్ మధ్య జరిపించాలని బీసీసీఐ అనుకుంటోంది. ఈ దిశగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఐసీసీలో వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మెజారిటీ సభ్య దేశాలు టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేయడానికే ఐసీసీ సమావేశంలో మొగ్గు చూపే అవకాశముంది.

పాకిస్తాన్ గరం గరం

టీ 20 ప్రపంచకప్ వాయిదా పడితే పాకిస్తాన్ కు వచ్చిన బాధేమీ లేదు కానీ… ఆ ప్లేస్ లో ఐపీఎల్ జరిగే అవకాశాన్నే భరించలేకపోతున్నది… టీ20 వరల్డ్ కప్ కు ఎంత కాదనుకున్నా ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. కనీసం ఇంకో రెండు నెలలైన వేచిచూస్తే మంచిదని పాకిస్తాన్ అంటోంది. రెండు నెలల తర్వాత కరోనా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఐసీసీని కోరుతోంది.. పరిస్థితులు అనుకూలిస్తే క్రికెట్ క్యాలెండర్ ప్రకారం పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లు ఇంగ్లాండ్ లో పర్యటించాలని.. దేశవాళీ టోర్నమెంట్ అయిన ఐపీఎల్ కు ఎలా ప్రాధాన్యత ఇస్తారని పాక్ ప్రశ్నిస్తోంది.. ఐపీఎల్ ను బీసీసీఐ నిర్వహిస్తోందే తప్ప ఐసీసీ కాదని….. టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడితే ఆ సమయాన్ని ఐపీఎల్‌కు కేటాయిస్తామంటే తాము వ్యతిరేకిస్తామని పాక్ అంటోంది. ఐసీసీ ఈవెంట్స్‌, ద్వైపాక్షిక సిరీస్‌లకు మాత్రమే తాము ప్రాధాన్యత ఇస్తామని…. వాటి స్థానాల్లో దేశీయ టోర్నీలకు తాము మద్దతివ్వమని కరాఖండిగా చెబుతోంది.

Read More:

తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు..

CBSE విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సొంత జిల్లాల నుంచే పరీక్షలు..

ఆన్‌లైన్‌ ద్వారా పీఎఫ్ డబ్బును ఈజీగా విత్ డ్రా చేసుకోండిలా..!

విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయుధం.. సీఎం జగన్ కొత్త వెబ్‌సైట్..

అక్షయ్ గొప్ప మనసు.. మరోసారి భారీ విరాళం..