నటి కుష్బూ ఇంటి సమీపంలో కంటైనర్ కలకలం

నటి, కాంగ్రెస్ నేత కుష్బూ ఇంటి సమీపంలో కంటైనర్ కలకలం రేపింది. చెన్నై శాంతోమ్‌లోని ఆమె ఇంటి ముందు గత పది రోజులుగా ఓ కంటైనర్ నిలిపి ఉంది. దానిపై నెంబర్ ప్లేట్ కూడా లేదు. దీనిని ఫొటో తీసిన కుష్బూ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. మా ఇంటికి వెళ్లే వీధి ముందు నెంబర్ ప్లేట్ లేని కంటైనర్ గత పది రోజులుగా నిలిచి ఉంది. దాన్ని ప్రజలెవరూ పట్టించుకోవడం లేదు. దీనిపై ఫిర్యాదు చేయాలనే ఆలోచన […]

నటి కుష్బూ ఇంటి సమీపంలో కంటైనర్ కలకలం

Edited By:

Updated on: Jun 24, 2019 | 9:29 AM

నటి, కాంగ్రెస్ నేత కుష్బూ ఇంటి సమీపంలో కంటైనర్ కలకలం రేపింది. చెన్నై శాంతోమ్‌లోని ఆమె ఇంటి ముందు గత పది రోజులుగా ఓ కంటైనర్ నిలిపి ఉంది. దానిపై నెంబర్ ప్లేట్ కూడా లేదు. దీనిని ఫొటో తీసిన కుష్బూ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. మా ఇంటికి వెళ్లే వీధి ముందు నెంబర్ ప్లేట్ లేని కంటైనర్ గత పది రోజులుగా నిలిచి ఉంది. దాన్ని ప్రజలెవరూ పట్టించుకోవడం లేదు. దీనిపై ఫిర్యాదు చేయాలనే ఆలోచన కూడా ఎవరికీ రావడం లేదు అంటూ పేర్కొంది. ఇక ఈ ట్వీట్ చెన్నై పోలీసులకు చేరడంతో వారు దానిపై స్పందించారు. ఆ కంటైనర్ ఉన్న వీధి వివరాలను ఆమె ద్వారా తెలుసుకొని కేసు నమోదు చేసుకున్నారు.