చిత్తూరు జిల్లాలో ఇవాళ జరిగిన ఓ అగ్నిప్రమాదం అనుమానాలకు తావిస్తోంది. పుత్తూరు ప్రాంతంలోని చిన్న రాజకుప్పంలో శ్రీవెంకట పెరుమాళ్ ఇంజనీరింగ్ కాలేజీలో రెండు బస్సులు దగ్ధమయ్యాయి. పార్కింగ్ ప్రాంతంలో నిలిపిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తోపాటు కాలేజీ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఈ అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సుల్లో మంటలు ఎలా చెలరేగాయి? అసలు అగ్నిప్రమాదం ఎలా జరిగిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.