చాలా మందిని కలిశా.. సుశాంత్‌ అందరిలా కాదు.. అతడో అరుదైన వ్యక్తి

| Edited By: Pardhasaradhi Peri

Nov 21, 2020 | 12:26 PM

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ మరణించి దాదాపుగా ఆరు నెలలు కావొస్తోంది. అయితే ఇప్పటికీ అతడి మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

చాలా మందిని కలిశా.. సుశాంత్‌ అందరిలా కాదు.. అతడో అరుదైన వ్యక్తి
Follow us on

Sushant Singh Siddharth: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ మరణించి దాదాపుగా ఆరు నెలలు కావొస్తోంది. అయితే ఇప్పటికీ అతడి మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేశారని భావిస్తోన్న అభిమానులు, అతడికి న్యాయం జరగాలంటూ ఇప్పటికీ తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే సుశాంత్‌కి అత్యంత సన్నిహితంగా ఉన్న కొందరు ప్రముఖులు కూడా అతడిని మరిచిపోలేకపోతున్నారు. ఈ క్రమంలో నటుడు సిద్ధార్థ్‌ గుప్తా, సుశాంత్‌ని గుర్తు చేసుకున్నారు.

ఓ ఇంటర్వ్యూలో సుశాంత్‌ గురించి చెప్పుకొచ్చిన సిద్ధార్థ్‌.. అతడిని వివరించడానికి వ్యాఖ్యలు జరిపోవు. చాలా నిజాయితీపరుడు, అతడో మెంటార్‌, ఒక బ్రదర్‌. అతడితో ఉన్నన్ని రోజులు మనం ఇన్‌స్పైర్‌ అవ్వొచ్చు. నా అభిరుచులు, అతడి అభిమానులు చాలావరకు ఒకటే. మా ఇద్దరికి క్రీడలు అంటే చాలా ఇష్టం. ఇద్దరిదీ ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్‌. ఇద్దరికి సైన్స్ అంటే ఇష్టం. వీటన్నింటిని మించి అతడు చాలా తెలివైన వ్యక్తి. స్వతంత్రతా భావాలు కలిగిన వ్యక్తి. అతడో అరుదైన వ్యక్తి. ఒంటరిగా ఉండటానికి అసలు ఇష్టపడేవాడు కాదు అని తెలిపారు.

అంతేకాదు పొద్దున్నే లేచి సుశాంత్‌ కీర్తనలు పాడేవాడని, ఆ సమయంలో నా డోర్‌ని కొంచెం తెరిచి ఉంచే వాడని, అప్పుడు తాను లేచేవాడనని చెప్పుకొచ్చారు. ఇక సుశాంత్‌ వలనే తాను కాఫీకి అడిక్ట్‌ అయ్యాయని.. తాను లేచే సరికి తన కోసం ఎప్పుడూ కాఫీ చేసి ఉంచేవాడని గుర్తు చేసుకున్నారు. సుశాంత్‌ని తాను కలిసినప్పుడు పూర్తి ఆధ్మాత్మిక భావనలో ఉన్నాడని తెలిపారు.

”నేను చాలా మందిని కలిశా. కానీ సుశాంత్‌ అందరిలా కాదు. మనిషి ఎప్పుడూ స్మారక స్థితిలో ఉండాలన్న విషయాన్ని సుశాంత్‌ నుంచే నేర్చుకున్నా. సుశాంత్‌ మరణం నాకు తీరని లోటు. కలలు కనాలని అందరికీ చెప్పేవాడు. ఎలాంటి కలలు కనాలో కూడా సుశాంత్‌ నాకు” నేర్పించాడు అని సిద్ధార్థ్‌ భావోద్వేగంతో చెప్పుకున్నారు. కాగా ఏడాది పాటు సిద్ధార్థ్‌, సుశాంత్‌ ఫ్లాట్‌లో అతడితో కలిసి ఉన్నారు.