సూర్యప్రభ వాహనంపై శ్రీవారు

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి.. ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు గురువారం ఉదయం స్వామివారు శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవ మండపంలో మలయప్పస్వామి త్రివిక్రమ అంలంకారంలో దర్శనమిచ్చారు..

సూర్యప్రభ వాహనంపై శ్రీవారు

Updated on: Oct 22, 2020 | 12:33 PM

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి.. ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు గురువారం ఉదయం స్వామివారు శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవ మండపంలో మలయప్పస్వామి త్రివిక్రమ అంలంకారంలో దర్శనమిచ్చారు.. ఆ తర్వాత వేంకటేశ్వరస్వామి సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చాడు.. ఈ సకల చరాచర సృష్టికి సూర్యుడే ఆధారం.. మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఆ ప్రత్యక్ష నారాయణుడే! ప్రకృతికి చైతన్యాన్ని ప్రసాదించేది కూడా ఆయనే! అందుకే సూర్యుడిని సూర్యనారాయణ అని కొలుస్తున్నాం.. మహా తేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో విహరించిన సూర్యనారాయణుడిని దర్శించుకోవడమన్నది పూర్వజన్మ పుణ్యఫలం.. ఆ స్వామిని దర్శిస్తే సకలసంపదలు చేకూరుతాయి.. ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.. సుఖశాంతులు లభిస్తాయి.. రాత్రి ఏడు గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శమిస్తారు.. అంటే దివారాత్రాలకు ఆయనే అధిపతి అన్న మాట..చంద్రప్రభ వాహనం మీద వచ్చే స్వామి చంద్రప్రభలకు ప్రతీకలుగా వున్న.. తెలుగు వస్తాలు.. తెల్లని పుష్పాలు.. మాలలు ధరిస్తారు..