నార్త్ ఇండియా సూపర్ స్టార్ సూర్య తాజా మూవీ ‘సూరరై పొట్రు’ అనేక వివిదాల నడుమ అట్టహాసంగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది . ఈ సినిమా అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అనేక మంది తమిళ చిత్రప్రముఖులు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ సూర్య మాత్రం ఓటీటీ ఫ్లాట్ ఫాంలోనే సినిమా రిలీజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో భారీ రేటుకు అమెజాన్ ప్రైమ్ సూర్య సినిమాను సొంతం చేసుకున్నారు. దీంతో ఈ సినిమాని ఎన్నడూ లేనివిధంగా 200 దేశాల్లో హాలీవుడ్ రేంజ్‌లో విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని సూరరై పొట్రు సినిమా నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ తోపాటు, సహ నిర్మాత రాజశేఖర్ పాండియన్ కూడా ధృవీకరించారు. లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తున్నారు.