వైద్యవృత్తిని ఎంతో మంది ఎంచుకుంటారు. కానీ ప్రొపిషన్‌నే దైవంలా భావించేవారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. కానీ దానికి చైనాలోని ఓ డాక్టర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచారు. అస్సలు బ్రేక్ తీసుకోకుండా 10 ఆపరేషన్లు చేసి డాక్టరంటే వీడేరా అనిపించాడు. సౌత్ చైనాలోని లంగాంగ్ సెంట్రల్ హాస్పిటల్ (ఆర్థోపెడిక్)లో డాక్టర్ డైయూ అతని బృందం గత సోమవారం 13 గంటలపాటు పనిచేసి 10 ఆపరేషన్లు చేసింది. డాక్టర్ డైయూ విరామమే లేకుండా పనిచేశాడు. ఉదయం 8 గంటలకు ఆపరేషన్ థియేటర్‌లోకి అడుగుపెట్టిన అతను సాయంత్రం అయిందింటి వరకు 7 ఆపరేషన్లు చేశాడు. ఇక 8వ సర్జరీ సమయంలో పేషంట్‌కు అనస్థీషియా ఇవ్వడంలో కాస్త ఆలస్యమైంది. దాంతో డైయూకి ఓ 10 నిముషాలు సమయం దొరకడంతో థియేటర్‌లోని ఫ్లోర్‌పై ఓ మూల కూర్చోని ఓ చిన్న స్లీప్ వేసుకున్నాడు. ఆ టైంలో సిబ్బందిలో ఒకరు అతను కునుకుతీస్తున్న ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ డాక్టర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.