చెన్నైకు మరో షాక్.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న రైనా..

ఐపీఎల్ 2020 ఇంకా ప్రారంభం కాకముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు షాక్ మీద షాక్ తగులుతోంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ సురేష్ రైనా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

చెన్నైకు మరో షాక్.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న రైనా..

Edited By:

Updated on: Aug 29, 2020 | 5:33 PM

Suresh Raina IPL 2020: ఐపీఎల్ 2020 ఇంకా ప్రారంభం కాకముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు షాక్ మీద షాక్ తగులుతోంది. నిన్న జట్టులోని ఒక పేసర్, 12 మంది సపోర్ట్ స్టాఫ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా.. నేడు ఆ జట్టు స్టార్ ప్లేయర్ సురేష్ రైనా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎస్కే ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ”ఈ సమయంలో మేము రైనాకు, అతని కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తాము” అని ట్వీట్ చేసింది.

కాగా, ఐపీఎల్ 2020 వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. యూఏఈలోని అబుదాబీ, దుబాయ్, షార్జా స్టేడియాలలో మ్యాచులు జరగనున్నాయి. మొత్తం 54 రోజుల పాటు సాగనున్న ఈ లీగ్ ఫైనల్ నవంబర్ 10న జరగనుంది. ఇప్పటికే టీమ్స్ అన్నీ కూడా యూఏఈ చేరుకుని ఆరు రోజుల క్వారంటైన్ ను కూడా పూర్తి చేశాయి.

Read more:

బట్టల వ్యాపారికి కరోనా.. మర్కజ్‌ వెళ్లి వచ్చినట్లు గుర్తింపు..

తొలి వికెట్ తీసిన క్రికెట్ బాహుబలి  

విద్యార్థులకు అలెర్ట్.. నవంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ ఫస్టియర్ క్లాసులు 

పశువుల పాకలో పాఠాలు..! వానాకాలం చదువులు..! 

పబ్జీ గేమ్‌కు.. మరో నిండు ప్రాణం బలి.. 

లెక్కల ప్రశ్నకు హృదయాలు దోచుకుంటోన్న విద్యార్థి సమాధానం 

చిలీలో 45 వేల ఉపాధ్యాయుల ఆందోళన.. 

గోద్రాలో పోలీసులపై రాళ్ల దాడి.. 30 మంది అరెస్ట్..గోద్రాలో పోలీసులపై రాళ్ల దాడి.. 30 మంది అరెస్ట్..