పశువుల పాకలో పాఠాలు..! వానాకాలం చదువులు..!

పశువుల పాకలో టీచర్లు పాఠాలు చెబుతోన్నారు. ఈ దీన స్థితి పశ్చిమగోదావరి నర్సాపురం మండలంలో చోటుచేసుకుంది. మండల వ్యాప్తంగా 15 పాత స్కూల్ భవనాల కూల్చివేసిన అధికారులు.. మళ్లీ తిరిగి నిర్మించలేదు. ఈ సందర్భంగా నర్సాపురం మండలం పితాని మెరకలోని సుభాషిణి అనే టీచర్ మాట్లాడుతూ.. మొదట పాతగా ఉందని స్కూల్ భవనం పడగొట్టారని, మళ్లీ తిరిగి నిర్మించలేదన్నారు. దీంతో.. కొన్ని రోజులు పశువు పాకలో ఉన్నామని, అదికూడా ఖాళీ చేయమంటే.. విధిలేక గ్రామస్తులు నిర్మించిన పాకలోనే […]

పశువుల పాకలో పాఠాలు..! వానాకాలం చదువులు..!
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 09, 2019 | 12:45 PM

పశువుల పాకలో టీచర్లు పాఠాలు చెబుతోన్నారు. ఈ దీన స్థితి పశ్చిమగోదావరి నర్సాపురం మండలంలో చోటుచేసుకుంది. మండల వ్యాప్తంగా 15 పాత స్కూల్ భవనాల కూల్చివేసిన అధికారులు.. మళ్లీ తిరిగి నిర్మించలేదు. ఈ సందర్భంగా నర్సాపురం మండలం పితాని మెరకలోని సుభాషిణి అనే టీచర్ మాట్లాడుతూ.. మొదట పాతగా ఉందని స్కూల్ భవనం పడగొట్టారని, మళ్లీ తిరిగి నిర్మించలేదన్నారు. దీంతో.. కొన్ని రోజులు పశువు పాకలో ఉన్నామని, అదికూడా ఖాళీ చేయమంటే.. విధిలేక గ్రామస్తులు నిర్మించిన పాకలోనే పాఠశాల నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎండకైనా, వర్షానికైనా ఇందులోనే ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వసతులు లేక ప్రైవేట్ స్కూల్స్‌‌కి పిల్లలు వెళ్లిపోతున్నారని అన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి స్కూల్ నిర్మించాలని టీచర్ సహా విద్యార్థులు కోరుకుంటున్నారు.