AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి విలన్‌ పాత్రలో కనిపించనున్న కమెడియన్ కమ్ హీరో..? ఈసారి ఎర్రచందనం స్మగ్లర్‌గా.?

సునీల్ మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నారని చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ హీరోగా సుుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

మరోసారి విలన్‌ పాత్రలో కనిపించనున్న కమెడియన్ కమ్ హీరో..? ఈసారి ఎర్రచందనం స్మగ్లర్‌గా.?
Narender Vaitla
|

Updated on: Dec 23, 2020 | 2:32 PM

Share

Sunil acts as vilan in bunny movie: కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి హీరోగా మారారు నటుడు సునీల్. అయితే కమెడియన్‌గా సంపాదించుకున్న పేరు, విజయాలను మాత్రం హీరోగా అందుకోలేక పోయారు. హీరోగా పలు వరుస అపజయాలు ఎదురుకావడంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో ఎన్టీఆర్ స్నేహితుడు పాత్రతో తన పంథాను మరోసారి మార్చుకున్నారు సునీల్. ఇక అక్కడి నుంచి అడపాదడపా చిత్రాల్లో కనిపిస్తూ వస్తోన్న సునీల్.. రవితేజ హీరోగా తెరకెక్కిన ‘డిస్కో రాజా’లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించారు. కమెడియన్‌‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న సునీల్ ఈ సినిమాలో తన విలనిజాన్ని చూపించారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం సునీల్ మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నారని చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ హీరోగా సుుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే సునీల్ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం మొదట పలువురి పేర్లు వినిపించాయి. ఇందులో సునీల్ పేరు కూడా ఉంది. దీంతో పుష్పలో సునీల్‌ను విలన్ పాత్ర కోసమే తీసుకున్నారని చర్చ జరుగుతోంది. ఇందులో సునీల్ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించనున్నాడనేది సదరు వార్త సారాంశం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Follow Us
హెల్త్ సహకరించట్లేదా..షారుఖ్‌ ఎందుకు వద్దన్నట్టు?
హెల్త్ సహకరించట్లేదా..షారుఖ్‌ ఎందుకు వద్దన్నట్టు?
పెళ్ళయ్యాక మగవాళ్ళు ఇతర స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు?
పెళ్ళయ్యాక మగవాళ్ళు ఇతర స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు?
వాటర్‌ ట్యాప్‌ తిప్పితే నీళ్లు రావు..లైట్‌ వెలుగుతుంది..!ఈ జుగాడ్
వాటర్‌ ట్యాప్‌ తిప్పితే నీళ్లు రావు..లైట్‌ వెలుగుతుంది..!ఈ జుగాడ్
పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంగ్లీష్ ఎగ్జామ్ వాయిదా..
పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంగ్లీష్ ఎగ్జామ్ వాయిదా..
గండిపడ్డ కాలువలో తేలుతూ ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా
గండిపడ్డ కాలువలో తేలుతూ ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా
IPL Controversies: ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోయిన చేదు జ్ఞాపకాలు..!
IPL Controversies: ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోయిన చేదు జ్ఞాపకాలు..!
మీరు నిలబడే విధానమే.. మీ వ్యక్తిత్వం తెలియజేస్తుందని తెలుసా?
మీరు నిలబడే విధానమే.. మీ వ్యక్తిత్వం తెలియజేస్తుందని తెలుసా?
తెల్లారేసరికి గుడికి వచ్చిన అర్చకులు..
తెల్లారేసరికి గుడికి వచ్చిన అర్చకులు..
పొడవాటి జుట్టు రహస్యం ఇదే.. దివ్యభారతి ఏం చెప్పిందంటే..
పొడవాటి జుట్టు రహస్యం ఇదే.. దివ్యభారతి ఏం చెప్పిందంటే..
ఆ ఊళ్లోకి ఐస్‌క్రీం బండి వెళ్తే అంతే సంగతులు.. అమ్మితే జేబు ఖాళీ
ఆ ఊళ్లోకి ఐస్‌క్రీం బండి వెళ్తే అంతే సంగతులు.. అమ్మితే జేబు ఖాళీ