Sundeep Kishan First Look In A1 Movie: సందీప్ కిషన్ హీరోగా డెన్నిస్ జీవన్ దర్శకత్వంలో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ అనే సినిమా ఎరకెక్కుతోన్న విషయం తెలిసిందే. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నాడు. ఇటీవల పలు వరుస అపజాయలను ఎదుర్కొన్న సందీప్ ఈ సినిమాతో ఎట్టి పరిస్థితుల్లో భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.
Humbly presenting to you our most Ambitious Film to date,TFI’s 1st hockey film
Also Happens to be my #25th film ??
1st look of our Baby#A1Express ❤️
A @hiphoptamizha ?#DennisJeevan @Itslavanya @dir_Aswin @peoplemediafcy @AAArtsOfficial @talkiesV @ChotaKPrasad @Kavin_raj15 pic.twitter.com/ho4mb0H2u5
— Sundeep Kishan (@sundeepkishan) January 9, 2021
ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రంలోని సందీప్ కిషన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. సందీప్ ట్విట్టర్ వేదికగా ఈ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఓ చేతిలో హాకీ మరో చేతిలో టీషర్ట్ పట్టుకొని విజయ దరహాసంతో కనిపిస్తోన్న సందీప్ కిషన్ ఫొటో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నాడు. ఈ ఫొటోతో పాటు… తెలుగులో హాకీ నేపథ్యంలో రానున్న తొలి సినిమా ఇదే అంటూ క్యాప్షన్ జోడించాడు సందీప్. ఇక ఈ సినిమా సందీప్ కిషన్ 25వ సినిమా కావడం మరో విశేషం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ చిత్రం ఈ యంగ్ హీరోకు ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.