అవన్నీ వట్టి రూమర్లు మాత్రమే.. సుదీప్ క్లారిటీ!

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్ 3’ చిత్రంలో విలన్‌గా నటించాడు కన్నడ స్టార్ హీరో సుదీప్. ఆ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. సుదీప్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇకపోతే రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ఈ స్టార్ హీరో కీలక పాత్ర పోషిస్తున్నాడంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ నెల 20 నుంచి షూటింగ్‌లో కూడా జాయిన్ అవుతాడని ప్రచారం సాగుతోంది. ఇక ఈ ఊహాగానాలపై సుదీప్ […]

అవన్నీ వట్టి రూమర్లు మాత్రమే.. సుదీప్ క్లారిటీ!

Updated on: Jan 19, 2020 | 2:20 PM

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్ 3’ చిత్రంలో విలన్‌గా నటించాడు కన్నడ స్టార్ హీరో సుదీప్. ఆ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. సుదీప్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇకపోతే రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ఈ స్టార్ హీరో కీలక పాత్ర పోషిస్తున్నాడంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

అంతేకాకుండా ఈ నెల 20 నుంచి షూటింగ్‌లో కూడా జాయిన్ అవుతాడని ప్రచారం సాగుతోంది. ఇక ఈ ఊహాగానాలపై సుదీప్ ఎట్టకేలకు ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తనను ఎవరూ సంప్రదించలేదని.. కీలక పాత్ర పోషిస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని’ స్పష్టం చేశాడు. కాగా, సుదీప్ ప్రస్తుతం ‘కోటిగొబ్బ 3’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Follow Us