ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు

|

Aug 05, 2020 | 6:59 PM

కరోనాతో విలవిలలాడుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైకి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 3 రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు మహా నగరం తడిసి ముద్దవుతోంది. థానే, పాల్గర్, రాయ్‌ఘడ్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడ్డాయి.

ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు
Follow us on

Heavy Rainfall Hits Mumbai: కరోనాతో విలవిలలాడుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైకి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 3 రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు మహా నగరం తడిసి ముద్దవుతోంది. థానే, పాల్గర్, రాయ్‌ఘడ్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడ్డాయి. రాగల 24 గంటల్లో ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముంబై తీర ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.

నైరుతి రుతుపవనాలకు తోడు..అరేబియా సముద్రంలో ఏర్పడిన ద్రోణి కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ముంబై నగరం మొత్తం నిండు కుండాల మారిపోయింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

రాగల 48 గంటల్లో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసింది. నగరంలోని పారెల్, దాదర్, కింగ్స్ సర్కిల్, సియాన్ వంటి పలు ప్రాంతాలు అడుగు నుంచి రెండడుగుల వరకూ నీటిలో చిక్కుకున్నాయి. శాంతాక్రుజ్, గొరెగావ్, మలద్, కాండివలి, బోరివలి, ఇతర పశ్చిమ ప్రాంత శివార్లలో కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి.