Strain Virus Tension: బ్రిటన్‌లో కొత్తరకం కరోనా ‘స్ట్రెయిన్’ వైరస్ విజృంభణ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. యూకే నుంచి వచ్చినవారిపై ప్రత్యేక దృష్టి సారించింది. గత నెల రోజుల వ్యవధిలో బ్రిటన్ నుంచి ఏపీకి సుమారు 1148 మంది ప్రయాణీకులు వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది.
అందులో 1040 మంది ఆచూకీని అధికారులు గుర్తించారు. వీరిలో ప్రస్తుతం 982 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కొత్త స్ట్రెయినా.? కాదా.? అని తెలుసుకునేందుకు వారి శాంపిల్స్‌ను సీసీయంబీ, ఎన్ఐవి పూణేకు వైద్య ఆరోగ్య శాఖ పంపించింది. కాగా, ప్రస్తుతం 88 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాకపోగా.. మరో 16 మంది అడ్రెస్‌లు సరిగా లేవని, ఇంకో 18 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారిగా అధికారులు గుర్తించారు.
Also Read:
Bigg Boss 4: మెహబూబ్ సైగలపై స్పందించిన అభిజిత్.. ‘స్టార్ మా’ తేల్చాలంటూ ఆసక్తికర కామెంట్స్.!
కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి.!
ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం దుకాణాలు, బార్లపై నిషేధం లేదంటూ..!
షాకింగ్ న్యూస్: కరోనా లక్షణాలు లేవని ఆఫీస్‌కు వచ్చిన ఉద్యోగి.. ఏడుగురు మృతి, 300 మంది క్వారంటైన్.!