పశ్చిమ బెంగాల్‌కూ ‘ఫొని’ ఎఫెక్ట్

|

May 03, 2019 | 12:00 PM

ఒడిశా: పూరీలో తీరాన్ని తాకి…మూడు గంటలుగా తీవ్ర ప్రభావం చూపింది ప్రచండ ‘పోని’ తుపాన్. భారీ స్థాయిలో నష్టాన్ని కలగజేసింది. మధ్యాహ్నం నుంచీ బలహీన పడనున్న తుఫాను… శనివారం సాయంత్రానికి పూర్తిగా బలహీన పడుతుందని అధికారులు తెలిపారు. భువనేశ్వర్ నుంచీ తుఫాను దిశ మార్చుకొని… తిరిగి సముద్రంలోకి వెళ్లి… బెంగాల్‌లో తీరం దాటనుంది. దీని ప్రభావంతో బెంగాల్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే మణిపూర్, నాగాలాండ్‌లో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు తాజాగా అంచనా వేశారు. ప్రస్తుతం […]

పశ్చిమ బెంగాల్‌కూ ఫొని ఎఫెక్ట్
Follow us on

ఒడిశా: పూరీలో తీరాన్ని తాకి…మూడు గంటలుగా తీవ్ర ప్రభావం చూపింది ప్రచండ ‘పోని’ తుపాన్. భారీ స్థాయిలో నష్టాన్ని కలగజేసింది. మధ్యాహ్నం నుంచీ బలహీన పడనున్న తుఫాను… శనివారం సాయంత్రానికి పూర్తిగా బలహీన పడుతుందని అధికారులు తెలిపారు. భువనేశ్వర్ నుంచీ తుఫాను దిశ మార్చుకొని… తిరిగి సముద్రంలోకి వెళ్లి… బెంగాల్‌లో తీరం దాటనుంది. దీని ప్రభావంతో బెంగాల్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే మణిపూర్, నాగాలాండ్‌లో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు తాజాగా అంచనా వేశారు. ప్రస్తుతం భువనేశ్వర్‌పై ప్రభావం చూపిస్తున్న తుఫాను… అక్కడ భారీ వర్షాలు కురిసేలా చేస్తోంది.

ప్రస్తుతం ‘ఫొని’ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర మొదలు… బంగ్లాదేశ్ వరకూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే… ఈశాన్య భారతంలో మాత్రం జల్లులు పడుతున్నాయి. ఒడిశాపై మాత్రం తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపించింది. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పూరీ, భువనేశ్వర్‌లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి.