షాకింగ్…బాలిక కంట్లో నుంచి రాళ్లు..

నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం మదన్‌పల్లి గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక రాజేశ్వరి కంటి సమస్కలతో బాధపడుతోంది. ఎడమ కంట్లో నుంచి ఒకదాని వెంట ఒకటి రాళ్లు బయట పడుతుండడంతో ..బాలిక పేరేంట్స్ తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో  7వ తరగతి చదువుతున్న రాజేశ్వరి గత 3 రోజుల నుంచి ఎడమ కన్ను నొప్పితో బాధపడుతోంది. రెప్ప కింది భాగం నుంచి వివిధ సైజుల్లో ఉన్న రాళ్లు పడుతున్నాయని బాలిక తల్లి విజయ […]

షాకింగ్...బాలిక కంట్లో నుంచి రాళ్లు..

Updated on: Feb 04, 2020 | 12:13 PM

నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం మదన్‌పల్లి గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక రాజేశ్వరి కంటి సమస్కలతో బాధపడుతోంది. ఎడమ కంట్లో నుంచి ఒకదాని వెంట ఒకటి రాళ్లు బయట పడుతుండడంతో ..బాలిక పేరేంట్స్ తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో  7వ తరగతి చదువుతున్న రాజేశ్వరి గత 3 రోజుల నుంచి ఎడమ కన్ను నొప్పితో బాధపడుతోంది. రెప్ప కింది భాగం నుంచి వివిధ సైజుల్లో ఉన్న రాళ్లు పడుతున్నాయని బాలిక తల్లి విజయ తెలిపారు. ఇప్పటికి 25 రాళ్లు గుర్తించినట్టు వెల్లడించారు.

దీంతో వెంటనే ఆమెను నిజమాబాద్‌లోని కంటి వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్లు..బాలికను హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే వైద్య ఖర్చులు భరించేందుకు బాధితురాలి కుటుంబం భయపడుతోంది. తన భర్త గల్ఫ్‌ కంట్రీస్‌కు వెళ్లాడని, తాను బీడీలు చుడుతూ పిల్లని చదివించుకుంటున్నాని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాగా సదరు మహిళ తమకు పిల్లలు కలగకపోవడంతో..సొంత చెల్లి కూతుర్ని దత్తత తీసుకుంది.