RRR Movie : ‘ఆర్ఆర్ఆర్’మరో బాలీవుడ్ బ్యూటీ.. స్సెషల్ సాంగ్ కోసం రంగంలోకి దించనున్న రాజమౌళి..

|

Jan 07, 2021 | 10:29 AM

ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది. చరిత్రలో ఎక్కడ కలవని ఇద్దరు వీరులను కలిపి ఈ సినిమాలో చూపిస్తున్నాడు జక్కన

RRR Movie : ఆర్ఆర్ఆర్మరో బాలీవుడ్ బ్యూటీ.. స్సెషల్ సాంగ్ కోసం రంగంలోకి దించనున్న రాజమౌళి..
Follow us on

RRR Movie : ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది. చరిత్రలో ఎక్కడ కలవని ఇద్దరు వీరులను కలిపి ఈ సినిమాలో చూపిస్తున్నాడు జక్కన. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. అలాగే ఎన్టీఆర్ గిరిజన వీరుడు కొమురం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్, హాలీవుడ్ నటులను కూడా రంగంలోకి దింపాడు జక్కన. ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లో అలియా భట్ – ఒలీవియా మోరిస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన రెండు టీజర్లు సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఓ బాలీవుడ్ బ్యూటీ కూడా ఈ సాంగ్ లో మెరవనుందని టాక్ నడుస్తుంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి అదిరిపోతే  ట్యూన్ ని రెడీ చేసారని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో అజయ్ దేవగన్, శ్రియా, సముద్రఖని వంటి స్టార్స్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఆర్.ఆర్.ఆర్’ ను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan-Rana Movie : పవన్-రానా మూవీ షూటింగ్ అప్‌డేట్.. సినిమా కోసం భారీ లాడ్జి సెటప్

Covid Vaccine Alert: కరోనా వ్యాక్సిన్‌ కావాలా అంటూ ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయా..? అయితే జాగ్రత్తగా ఉండండి..