రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. ఒక్క నెలలోనే..

| Edited By:

Jul 06, 2019 | 11:45 AM

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఒక్క జూన్ నెలలోనే రికార్డు స్థాయికి నమోదైంది. పిల్లలకు సమ్మర్ హాలీడేస్ కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జూన్‌ నెలలో 24.66 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. భక్తుల సంఖ్య పెరగడంతో పాటు.. డబ్బులు, కానుకలు భారీగా వచ్చాయని చెప్పారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.100.37 కోట్లు దాటిందని అధికారులు తెలిపారు. అయితే గతేడాది జూన్‌లో 24.1 లక్షల మంది భక్తులు […]

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. ఒక్క నెలలోనే..
Follow us on

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఒక్క జూన్ నెలలోనే రికార్డు స్థాయికి నమోదైంది. పిల్లలకు సమ్మర్ హాలీడేస్ కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జూన్‌ నెలలో 24.66 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. భక్తుల సంఖ్య పెరగడంతో పాటు.. డబ్బులు, కానుకలు భారీగా వచ్చాయని చెప్పారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.100.37 కోట్లు దాటిందని అధికారులు తెలిపారు. అయితే గతేడాది జూన్‌లో 24.1 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. ఈ ఏడాది అంతకు రెండు రెట్లు భక్తుల సంఖ్య పెరిగింది. శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది జూన్‌లో రూ. 91.81 కోట్లు వచ్చాయి. కాగా, 71.02 లక్షల మందికి అన్నప్రసాదాలు అందజేశామని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇందులో 1.13 కోట్ల లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేసినట్లు పేర్కొంది. 12.88 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీడీపీ చెప్పింది.