భక్తుల సౌకర్యార్ధం.. మరో 3వేల ఆన్‌లైన్‌ టోకెన్లు..

| Edited By:

Jun 25, 2020 | 12:51 PM

ఓవైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఆలయాలన్నీ దాదాపు 80 రోజులు మూతబడ్డాయి. 10 రోజుల క్రితమే తిరుమల శ్రీవారి ఆలయాన్ని తెరిచారు.

భక్తుల సౌకర్యార్ధం.. మరో 3వేల ఆన్‌లైన్‌ టోకెన్లు..
Follow us on

ఓవైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఆలయాలన్నీ దాదాపు 80 రోజులు మూతబడ్డాయి. 10 రోజుల క్రితమే తిరుమల శ్రీవారి ఆలయాన్ని తెరిచారు. ఈ నేపథ్యంలో తిరుమలలో అదనంగా మరో 3వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఈరోజు నుంచి 10వేల ఆన్‌లైన్‌ టోకెన్లతో పాటు అదనంగా మరో 3వేల టోకెన్లు జారీ చేసింది.

మరోవైపు.. లాక్‌డౌన్‌ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వడంతో.. కరోనా నిబంధనలను పాటిస్తూ జూన్ 11 నుంచి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ముందుగా 7 వేల మంది ఆన్‌లైన్‌ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే టీటీడీ ఆలయ అధికారులు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం మరో 3వేల మందికి పొడిగించి 10వేల టోకెన్లు జారీ చేశారు. తాజాగా గురువారం నుంచి 10వేలకు అదనంగా మరో 3వేల ఆన్‌లైన్‌ టోకెన్లు భక్తుల సౌకర్యార్ధం జారీ చేస్తున్నామని అధికారులు ప్రకటించారు.

Also Read: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అగ్ని ప్రమాదం