శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, రావణ వాహనంపై దర్శనమిచ్చిన భ్రమరాభ మల్లికార్జున స్వామి వార్లు

|

Jan 14, 2021 | 11:12 AM

శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. మూడవ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునస్వామి..

శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, రావణ వాహనంపై దర్శనమిచ్చిన భ్రమరాభ మల్లికార్జున స్వామి వార్లు
Follow us on

శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. మూడవ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునస్వామి రావణ వాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవ వేళ ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నులపండువగా ఆలయ ప్రదక్షిణలు గావించారు. ప్రధాన ఆలయ రాజగోపురం గుండా రావణ వాహనాదీశులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా బజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ఊరేగించారు. సంక్రాంతి పర్వదినం వేళ, శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది.