శ్రీశైల మల్లన్న భక్తులకు శుభవార్త…

|

Aug 13, 2020 | 9:53 PM

శ్రీశైల మహాక్షేత్రం భక్తుల కోసం రేపటి నుంచి తెరుచుకోనుంది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాలు శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి..

శ్రీశైల మల్లన్న భక్తులకు శుభవార్త...
Follow us on

శ్రీశైల మహాక్షేత్రం భక్తుల కోసం రేపటి నుంచి తెరుచుకోనుంది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాలు శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. గత వారం రోజుల క్రితం శ్రీశైల క్షేత్రంలో కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ఐదు రోజులపాటు ఆలయంలో దర్శనాలు నిలిపివేసిన విషయం తెలిసిందే.

రేపు ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు. 10 ఏండ్ల వయసు నుంచి 65 ఏండ్ల వయసులోపు ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తు ఆన్ లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు.  అలాగే భక్తులు తమ వెంట ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.