‘నన్నే కాదు.. నిర్బంధంలో ఉన్న ఇతర నేతలనూ రిలీజ్ చేయండి’.. ఒమర్ అబ్దుల్లా

| Edited By: Pardhasaradhi Peri

Mar 24, 2020 | 5:49 PM

జమ్మూకాశ్మీర్లో ఏడు నెలలుగా నిర్బంధంలో ఉన్న ఇతర నేతలను కూడా విడుదల చేయాలని  మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా భద్రతా చట్టం కింద ఆయన ఇన్నాళ్ళూ నిర్బంధంలో ఉన్నారు. మంగళవారం శ్రీనగర్ లో జైలునుంచి విడుదలైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీతో సహా ఇంకా అనేకమంది రాజకీయ నాయకులు జైలులో మగ్గుతున్నారని, వారినందరినీ విడుదల చేయాల్సిందిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. అలాగే ఇంటర్నెట్ పై ఇంకా […]

నన్నే కాదు.. నిర్బంధంలో ఉన్న ఇతర నేతలనూ రిలీజ్ చేయండి.. ఒమర్ అబ్దుల్లా
Follow us on

జమ్మూకాశ్మీర్లో ఏడు నెలలుగా నిర్బంధంలో ఉన్న ఇతర నేతలను కూడా విడుదల చేయాలని  మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా భద్రతా చట్టం కింద ఆయన ఇన్నాళ్ళూ నిర్బంధంలో ఉన్నారు. మంగళవారం శ్రీనగర్ లో జైలునుంచి విడుదలైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీతో సహా ఇంకా అనేకమంది రాజకీయ నాయకులు జైలులో మగ్గుతున్నారని, వారినందరినీ విడుదల చేయాల్సిందిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. అలాగే ఇంటర్నెట్ పై ఇంకా అమలులో ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న370 అధికరణాన్ని కేంద్రం రద్దు చేసినందువల్ల  ఈ కేంద్ర పాలిత ప్రాంతంపై పడిన ప్రభావాన్ని త్వరలో ప్రభుత్వానికి వివరిస్తానని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ‘ఈ రోజు మనం జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నాం.. కరోనా విలయ తాండవం చేస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు కట్టుబడి ఉందాం’ అని ఆయన పేర్కొన్నారు.