Sri Lanka lifts nationwide lockdown: ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే.. దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ తొలగిస్తున్నట్లు శ్రీలంక ప్రకటించింది. ఈ మేరకు శ్రీలంక ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీలంకలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని ఇక్కడి ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. శ్రీలంకలో తొలుత మార్చి నెలలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఆ తర్వాత విడతలవారీగా లాక్‌డౌన్ తొలగించారు. అయితే ఆ తర్వాత మళ్లీ కరోనా కేసులు పెరిగిపోవడంతో ఏప్రిల్ చివర్లో మరోసారి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.