Sravanthi Ravi Kishore : మాకు సినిమా ఒక వ్యాపారం కాదు… ఓటీటీలపై సంచలన కామెంట్లు చేసిన స్టార్ ప్రొడ్యూసర్..

|

Jan 21, 2021 | 5:36 AM

కరోనా పుణ్యమా అని ఓటీటీ లకు బాగా డిమాండ్ పెరిగింది. చాలా సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యాయి. అన్ని సినిమాలు ఆకట్టుకోలేకపోయినా..కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించాయి..

Sravanthi Ravi Kishore : మాకు సినిమా ఒక వ్యాపారం కాదు... ఓటీటీలపై సంచలన కామెంట్లు చేసిన స్టార్ ప్రొడ్యూసర్..
Follow us on

Sravanthi Ravi Kishore : కరోనా పుణ్యమా అని ఓటీటీ లకు బాగా డిమాండ్ పెరిగింది. చాలా సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యాయి. అన్ని సినిమాలు ఆకట్టుకోలేకపోయినా..కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా.. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఓటిటి రిలీజ్‌లు కొందరు నిర్మాతలకు అస్సలు నచ్చడం లేదు. వాళ్లు ఇప్పటికీ ఓటిటి విడుదలకు విరుద్ధంగానే ఉన్నారు. వారిలో స్రవంతి రవి కిషోర్ ఒకరు.

రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘రెడ్’ సంక్రాంతి కానుకగా విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సంగతి తెలిసిందే. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. స్రవంతి రవి కిషోర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాను ఓటిటిలో విడుదల చేయాలంటూ చాలా మంది మంచి ఆఫర్స్ ఇచ్చారని చెప్పాడు రవికిషోర్. కానీ థియేటర్స్‌లో విడుదల చేయడానికే ఇన్నాళ్ల టైమ్ తీసుకున్నామని చెప్పాడు ఈయన.  10 రూపాయలు పెట్టుబడి పెడితే 12 రూపాయలు వస్తే చాలు అనుకునే వాళ్లు ఉన్నారు. 10 రూపాయలకు 9 రూపాయలు వచ్చినా 12 రూపాయలు వచ్చినా ప్రేక్షకుడి నుంచే నేరుగా రావాలని నేను ఆలోచిస్తా. సినిమాపై ఇలాంటి అభినివేశం ఉన్న నిర్మాతలం కొద్ది మంది ఉన్నాం అంటూ చెప్పుకొచ్చారు. ప్రేక్షకులు సినిమాను చూడాలనేది మా లక్ష్యం. పెట్టుబడిపై ఎంతో కొంత లాభం వస్తే చాలు అనుకుని సినిమాను వ్యాపారంగా చూసేవాళ్లను మనం ప్రశ్నించలేం” అని రవి కిషోర్ చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ప్లీజ్ నన్ను ఫాలో కావొద్దు.. దండం పెట్టి మరీ ప్రాధేయపడిన హీరోయిన్.. వీడియో వైరల్..