లాక్‌డౌన్ వేళ.. ఆ రెండు అణు విద్యుత్ టవర్లు నేలమట్టం.. రీజన్ ఇదే

ఎన్నో ఏళ్లుగా మూసివేసిన అణు విద్యుత్ టవర్లను ఎట్టకేలకు జర్మనీ ప్రభుత్వం కూల్చివేసింది. దాదాపు ఈ రెండు టవర్ల ఎత్తు 500 ఫీట్ల వరకు ఉంటుంది. ప్రపంచలో ఎత్తైన అణు విద్యుత్ టవర్లలో ఇవి కూడా ఒకటి. అయితే వీటిని గురువారం నాడు జర్మన్ ప్రభుత్వం నేలకూల్చింది. ఈ రెండు కూలింగ్ టవర్లు.. ఫిలిప్స్‌బర్గ్‌ కర్మాగారానికి చెందినవి. అయితే ఈ రెండింటిలో ఒక రియాక్టర్‌ను 2011లో, మరోదాన్ని 2019లో మూసివేశారు. దీంతో పరిశ్రమ మొత్తం క్లోజ్ అయ్యింది. […]

లాక్‌డౌన్ వేళ.. ఆ రెండు అణు విద్యుత్ టవర్లు నేలమట్టం.. రీజన్ ఇదే

Edited By:

Updated on: May 17, 2020 | 4:09 PM

ఎన్నో ఏళ్లుగా మూసివేసిన అణు విద్యుత్ టవర్లను ఎట్టకేలకు జర్మనీ ప్రభుత్వం కూల్చివేసింది. దాదాపు ఈ రెండు టవర్ల ఎత్తు 500 ఫీట్ల వరకు ఉంటుంది. ప్రపంచలో ఎత్తైన అణు విద్యుత్ టవర్లలో ఇవి కూడా ఒకటి. అయితే వీటిని గురువారం నాడు జర్మన్ ప్రభుత్వం నేలకూల్చింది. ఈ రెండు కూలింగ్ టవర్లు.. ఫిలిప్స్‌బర్గ్‌ కర్మాగారానికి చెందినవి. అయితే ఈ రెండింటిలో ఒక రియాక్టర్‌ను 2011లో, మరోదాన్ని 2019లో మూసివేశారు. దీంతో పరిశ్రమ మొత్తం క్లోజ్ అయ్యింది. ఈ క్రమంలో వీటిని ఎలాంటి ప్రమాదం లేకుండా కూల్చేయాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. అనుకున్నట్లుగానే ఈ రెండు కూలింగ్‌ టవర్లను పూర్తి నియంత్రిత విధానంతో.. ఎలాంటి ప్రమాదం జరగకుండా నేలమట్టం చేశారు. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. జర్మన్‌లో కూడా లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో ఇదే సమయంలో.. కూల్చుతున్నట్లు ప్రకటించకుండా.. అధికారులు పనిపూర్తి చేశారు. ఒకవేళ కూల్చుతున్నామని ముందే ప్రకటిస్తే.. అక్కడికి భారీ ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంటుందని.. దీంతో మళ్లీ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అణు విద్యుత్తును వాడరాదని నిర్ణయించిన జర్మనీ సర్కార్.. వచ్చే 2022 నాటికి దేశంలోని మొత్తం అణు విద్యుత్తు ప్లాంట్స్‌ను క్లోజ్ చేయాలని నిర్ణయించింది.