ఏపీలో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే..!

|

Aug 07, 2020 | 11:46 AM

స్థానిక సంస్థల పాలనపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 108 కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలలో ప్రత్యేకాధికారుల పాలనను ప్రభుత్వం పొడిగించింది.

ఏపీలో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే..!
Follow us on

AP Local Body Elections: స్థానిక సంస్థల పాలనపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 108 కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలలో ప్రత్యేకాధికారుల పాలనను ప్రభుత్వం పొడిగించింది. దీనితో ఏపీలో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్లుగా ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినట్లయింది. కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన నేపధ్యంలో ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లుగా పురపాలకశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

శ్రీకాకుళం మినహా మిగిలిన అన్ని జిల్లాలోని కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను డిసెంబర్ 31 వరకు లేదా పాలకవర్గం ఏర్పాటు అయ్యేంతవరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళంలో మాత్రం అక్టోబర్ 10వ తేదీ వరకు ప్రత్యేకాధికారుల పాలనను పొడిగించింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లో వచ్చే ఏడాది జనవరి 2 వరకు ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పల్లెల్లోనూ మాస్క్ తప్పనిసరి.. లేదంటే జరిమానా!

కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఆరు రకాలు.. ఆ లక్షణాలు ఉంటే జాగ్రత్త.!

జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి కాలేజీలు ఓపెన్..