
విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ వినూత్న ఐడియాతో ముందుకొచ్చింది. ఉపయోగించిన మాస్కులకు వేయడానికి నగరంలో వివిధ చోట్ల స్పెషల్ డస్ట్ బిన్ లను ఏర్పాటు చేసింది. వినియోగించిన మాస్కులతో వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ డస్ట్ బిన్ లు కరోనా వైరస్ రూపాన్ని పోలి ఉంటాయి. కాగా ఉపయోగించిన మాస్కులు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఈ డస్ట్ బిన్స్ లో వేయాలని అధికారులు కోరుతున్నారు. ఇలా చేయడం ద్వారా మున్సిపల్ సిబ్బందికి, సాటి ప్రజలకు రిస్క్ తగ్గించినవారవుతారని చెబుతున్నారు.
ఇక కృష్ణ జిల్లాలో కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. ఈ రోజు రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా 230 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 124గా ఉంది. అత్యధిక మరణాలు ఉన్న జిల్లాల్లో కర్నూలు(142) తర్వాత కృష్ణ రెండో స్థానంలో ఉంది.