హైదరాబాద్‌ రౌడీషీటర్లపై నగర పోలీసులు నిఘా.. పాతబస్తీలో ఇళ్లకు వెళ్లి తనిఖీ చేసిన డీసీపీ

|

Dec 30, 2020 | 10:54 PM

హైదరాబాద్ మహానగరంపై పోలీసులు నిఘా పెంచారు. పాతబస్తీలోని రౌడీ షీటర్లను వారి కదలికలపై కన్నేసిన పోలీసులు.. ఆకస్మిక తనిఖీలు చేశారు.

హైదరాబాద్‌ రౌడీషీటర్లపై నగర పోలీసులు నిఘా.. పాతబస్తీలో ఇళ్లకు వెళ్లి తనిఖీ చేసిన డీసీపీ
Follow us on

హైదరాబాద్ మహానగరంపై పోలీసులు నిఘా పెంచారు. పాతబస్తీలోని రౌడీ షీటర్లను వారి కదలికలపై కన్నేసిన పోలీసులు.. ఆకస్మిక తనిఖీలు చేశారు. సౌత్ జోన్ డీసీపీ గజారావు భూపాల్ ఆధ్వర్యంలో ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో పేరు మోసిన రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన పోలీసులు.. రౌడీషీటర్ల ప్రవర్తనలో మార్పు , నేరాలకు దూరంగా ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. పాత నేరాలు విడిచిపెట్టి ప్రజా జీవితంలో ప్రశాంతంగా ఉండాలని సూచించారు. పాతబస్తీలోని రౌడీ షీటర్ల కార్యకలాపాలపై వారి కదలికలపై నిఘా పెట్టామని సౌత్ జోన్ డీసీపీ గజారావు భూపాల్ తెలిపారు. వారు నేరాలకు పాల్పడకుండా ఉండేందుకు వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ప్రత్నిస్తున్నామన్నారు. వారు తిరిగి నేరాలు చేయకుండా కట్టడి చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని డీసీపీ గజారావు భూపాల్ తెలిపారు.

ఇదీ చదవండిః

https://tv9telugu.com/ap-government-orders-andhra-pradesh-timings-of-liquor-shops-378536.html