అయ్యో పాపం…పెంపుడు సింహాలతో వాకింగ్ చేస్తుండగా..

| Edited By: Team Veegam

Sep 15, 2020 | 8:27 PM

దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ వన్యమృగాల సంరక్షకుడు వెస్ట్‌ మ్యాథ్యూసన్‌  సింహం పిల్లలుగా ఉన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా వాటిని పెంచుతున్నాడు. బుధవారం ఉదయం వాటితో కలిసి ఆయన మార్నింగ్‌ వాక్‌కు వెళ్లారు. వాకింగ్‌ చేస్తుండగా హఠాత్తుగా ఓ సింహం  ఆయనపై పడి దాడి...

అయ్యో పాపం...పెంపుడు సింహాలతో వాకింగ్ చేస్తుండగా..
Follow us on

పాముకు పాలు పోసి పెంచడం.. పులిపై స్వారీ చేయడం రెండు ప్రమాదమే. అయితే ఈ విషయం తెలియని ఓ పెద్దాయన సింహాలనే పెంచుకున్నాడు. పాలు పోసి.. మంచి మటన్ పెట్టి కన్న బిడ్డల్లా పోషించాడు. ఆట.. పాట.. వాటితోనే సాగేది. ఎంత పెంపుడు అడవి జంతువైనా.. ఏదో రోజు ఎదురు తిరగడం ఖాయం. దక్షిణాఫ్రికాలో ఇదే జరిగింది. సౌత్ ఆఫ్రికాలో అతనికి ‘అంకుల్ వెస్ట్ ‘ అని పేరు కూడా ఉంది.

దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ వన్యమృగాల సంరక్షకుడు వెస్ట్‌ మ్యాథ్యూసన్‌  సింహం పిల్లలుగా ఉన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా వాటిని పెంచుతున్నాడు. బుధవారం ఉదయం వాటితో కలిసి ఆయన మార్నింగ్‌ వాక్‌కు వెళ్లారు. వాకింగ్‌ చేస్తుండగా హఠాత్తుగా ఓ సింహం  ఆయనపై పడి దాడి చేయటం మొదలుపెట్టింది. అనంతరం మరో సివంగి కూడా దాడికి దిగింది. ఆ పక్కనే పనివారు… అతని భార్య ఆడుకుంటున్నాయేమో అని అనుకున్నారు.. కానీ వాటి దాడి పెరగడం.. వాటి నుంచి తప్పించుకునేందుకు భర్త చేస్తున్న ప్రయత్నాలను గుర్తించిన భర్య వెంటనే వాటి నుంచి రక్షించే ప్రయత్నాలు చేసింది.

ఆ సమయంలో మ్యాథ్యూతో పాటు ఉన్న ఆయన భార్య.. వాటి నుంచి భర్తను రక్షించటానికి చాలా ప్రయత్నించింది. అయినప్పటికి లాభం లేకపోయింది. దీంతో పెంపుడు సింహాల చేతిలోనే ఆయన ప్రాణం కోల్పోయారు. ఈ నేపథ్యంలో మ్యాథ్యూ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆ రెండు తెల్ల సివంగులను సంరక్షకుడి ఇంటినుంచి వేరే ప్రాంతానికి తరలించారు అధికారులు. వాటి భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.