కరోనా వైరస్ తీవ్రతతో సతమతమవుతున్న పలు దేశాలకు ఇండియా మందులు పంపుతూ సహాయపడుతుంటే మరి కొన్ని దేశాలు మాత్రం కోవిడ్ నేపథ్యంలో తమ స్వలాభం కోసం దీన్ని అనుచిత ప్రయోజనంగా మలచుకుంటున్నాయని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీ.ఎస్. త్రిమూర్తి అన్నారు. న్యూయార్క్ లో ఇండియా-యుఎన్ డెవలప్మెంట్ పార్ట్ నర్ షిప్ ఫండ్ మూడో యానివర్సరీ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాకిస్థాన్, చైనా దేశాల గురించి పరోక్షంగా ప్రస్తావించిన ఆయన.. ఇవి తమ ఉగ్రవాద కార్యకలాపాలను పెంచుకోవడానికో, లేదా తమ ‘దూకుడు’ విధానాలను పాటించడానికో కోవిడ్ ని వినియోగించుకుంటున్నాయని, వీటికి అడ్డుకట్ట పడాల్సిందేనని త్రిమూర్తి పేర్కొన్నారు. భారత ఉదారతను ఈ దేశాలు ఇలా ఉపయోగించుకుంటున్నాయన్నారు.
ఐరాస లో సమయం లభించినప్పుడు ఈ దేశాల నిర్వాకాన్ని భారత్ ఇలా ఎండగడుతోంది. భద్రతా మండలిలో వీటిని ఏకాకిని చేయడానికి ప్రయత్నిస్తోంది.