హైదరాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. మాదాపూర్‌లోని అరుణోదయ లేడీస్ హాస్టల్‌లో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకొంది. ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని ఫ్యానుకు ఉరి వేసుకొని ఆమె బలవన్మరణానికి పాల్పడింది.
వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని ఓ కంపెనీలో శ్రీవిద్య (25) సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో మాదాపూర్‌లోని అరుణోదయ హాస్టల్‌లో ఆమె ఈ నెల 10న చేరింది. గత రాత్రి రూమ్‌లో పడుకున్న శ్రీవిద్య ఉదయం ఎంతసేపు అయినప్పటికీ బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది కిటికీ నుంచి చూడగా.. ఆమె ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిది హత్యనా లేక ఆత్మహత్యానా అన్నది పోస్ట్‌మార్టం తరువాత తేలుస్తామని వారు అన్నారు.