అదురు,బెదురు లేదు.. కాలేజ్ ఆవరణలో పాముల ప్రకృతి ధర్మం

|

Nov 02, 2020 | 10:51 AM

ఎక్కడైనా పాము కనిపిస్తే… ఆమడదూరం పరుగెడుతాం.. రెండు పాములు ఒక్కసారిగా కనిపిస్తే ఇక.. జనం అటు వైపు చూసేందుకే జంకుతారు. మనుష్యులు కనిపిస్తే పాములుకూడా పొదల్లోకి హుటాహుటీన పాకిపోవడం మామూలే. కాని అనంతపురం జిల్లాలో ఇవన్నీ తీసికట్టయ్యాయి. రెండు పాములు లోకాన్నే మరచిపోయి సయ్యాట ఆడుతూ కనిపించాయి. ప్రకృతి ధర్మాన్ని నెరవేర్చాయి. అనంతపురం జిల్లా శింగనమల జూనియర్ కళాశాల ఆవరణంలో ఈ సంఘటన సోమవారం ఉదయం నెలకొంది. పట్టపగలు జనం తిరుగుతున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా పాములు సయ్యాటలో […]

అదురు,బెదురు లేదు.. కాలేజ్ ఆవరణలో పాముల ప్రకృతి ధర్మం
Follow us on

ఎక్కడైనా పాము కనిపిస్తే… ఆమడదూరం పరుగెడుతాం.. రెండు పాములు ఒక్కసారిగా కనిపిస్తే ఇక.. జనం అటు వైపు చూసేందుకే జంకుతారు. మనుష్యులు కనిపిస్తే పాములుకూడా పొదల్లోకి హుటాహుటీన పాకిపోవడం మామూలే. కాని అనంతపురం జిల్లాలో ఇవన్నీ తీసికట్టయ్యాయి. రెండు పాములు లోకాన్నే మరచిపోయి సయ్యాట ఆడుతూ కనిపించాయి. ప్రకృతి ధర్మాన్ని నెరవేర్చాయి. అనంతపురం జిల్లా శింగనమల జూనియర్ కళాశాల ఆవరణంలో ఈ సంఘటన సోమవారం ఉదయం నెలకొంది. పట్టపగలు జనం తిరుగుతున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా పాములు సయ్యాటలో తన్మయత్వం పొందాయి. సుమారు గంటకు పైగా అవి అక్కడే ఉండిపోయాయి.. లోకాన్నే మైమరచిపోయాయి. ఈజోడు పాముల సయ్యాట టీవీ9 కెమెరాకు చిక్కింది. ఇవే ఆ దృశ్యాలు.