బీజేపీ కార్యకర్త పాడె మోసిన స్మృతి ఇరానీ

| Edited By: Pardhasaradhi Peri

May 27, 2019 | 10:11 AM

యూపీలోని అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ అనుచరుడు.. బీజేపీ నేత సురేంద్ర సింగ్‌ను కాంగ్రెస్ నేతలే దారుణంగా హతమార్చారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఎంపీ స్మృతి ఇరానీ మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం సురేంద్రసింగ్ అంత్యక్రియల్లో పాల్గొని ఆయన పాడె మోశారు. భారత్ మాతా కీ జై..సురేంద్రసింగ్ అమర్ రహే అంటూ గ్రామస్థులు, బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బారాలియా గ్రామ సర్పంచ్ పదవికి రాజీనామా చేసి.. ఆయన […]

బీజేపీ కార్యకర్త పాడె మోసిన స్మృతి ఇరానీ
Follow us on

యూపీలోని అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ అనుచరుడు.. బీజేపీ నేత సురేంద్ర సింగ్‌ను కాంగ్రెస్ నేతలే దారుణంగా హతమార్చారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఎంపీ స్మృతి ఇరానీ మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం సురేంద్రసింగ్ అంత్యక్రియల్లో పాల్గొని ఆయన పాడె మోశారు. భారత్ మాతా కీ జై..సురేంద్రసింగ్ అమర్ రహే అంటూ గ్రామస్థులు, బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బారాలియా గ్రామ సర్పంచ్ పదవికి రాజీనామా చేసి.. ఆయన అమేథీలోని స్మృతి ఇరానీని గెలిపించేందుకు కృషి చేశారు.

అయితే తన తండ్రిని కాంగ్రెస్ నేతలే హత్యచేసి ఉంటారని అన్నారు సురేంద్రసింగ్ కుమారుడు అభయ్. స్మృతి ఇరానీ గెలవడంతో విజయోత్సవ వేడుకలు జరుపుకున్నామని.. ఆ వేడుకలు జరుపుకోవడం చూసి ఒర్వలేకే ఈ దారుణానికి పాల్పడ్డారని వాపోయాడు. అయితే ఇప్పటికే ఈ హత్యకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.