యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి 30 మందితో వెళ్తున్న ఓ ట్రాక్టర్.. దిలారీ ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నఖుంకా గ్రామంలో బర్త్‌డే పార్టీ ముగించుకొని భజల్‌పూర్ గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు […]

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Edited By:

Updated on: May 13, 2019 | 12:46 PM

ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి 30 మందితో వెళ్తున్న ఓ ట్రాక్టర్.. దిలారీ ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నఖుంకా గ్రామంలో బర్త్‌డే పార్టీ ముగించుకొని భజల్‌పూర్ గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.