AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karimnagar Sister kills Brother: కామంతో కళ్లుమూసుకుపోయి అసభ్యంగా ప్రవర్తించిన సోదరుడు.. రోకలిబండతో కొట్టి చంపిన చెల్లెలు!

వావీ వరసలు మరిచాడు. సొంత చెల్లెలు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె చేతికి దొరికన రోకలిబండతో కొట్టి చంపేసింది.

Karimnagar Sister kills Brother: కామంతో కళ్లుమూసుకుపోయి అసభ్యంగా ప్రవర్తించిన సోదరుడు.. రోకలిబండతో కొట్టి చంపిన చెల్లెలు!
murder
Balaraju Goud
|

Updated on: Jun 11, 2021 | 7:48 AM

Share

Karimnagar Sister kills Brother: అసలే మద్యం మత్తులో పరిసరాలను మర్చిపోయాడు. ఏం చేస్తున్నా అన్న ధ్యాసే లేకుండా పోయింది. అమ్మాయి కనిపించింది. ఇక మనసు వింటుందా.. వావీ వరసలు మరిచాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె చేతికి దొరికన రోకలిబండతో కొట్టి చంపేసింది. ఈ ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన ఓ వ్యక్తి పూటుగా తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో సోదరి కనిపింది. అయితే, మద్యం మత్తులో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎంత బ్రతిమాలిన వినిపించుకోలేదు. అయితే ఇదే క్రమంలో తనను రక్షించుకునేందుకు చేతికంది వస్తువును అతనిపైకి విసిరింది. ఇదే క్రమంలో ఆమె రోకలి బండతో అతనికి కొట్టింది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోనే ఇలా చేశానని ఆమె వెల్లడించింది. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also…  US Resume Student Visa: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సోమవారం నుంచి స్టూడెంట్ వీసాల ప్రక్రియ.. తొలుత వారికి మాత్రమే ప్రాధాన్యం!