వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు ఆ పోలీసులు పడ్డ తాపత్రయానికి సెల్యూట్‌

|

Sep 02, 2020 | 12:50 PM

మానవత్వం ఇంకా బతికే ఉందని చెప్పడానికి ఆ ఇద్దరు పోలీసులను చూపిస్తే చాలు. వాళ్లిద్దరూ చేసిన పని చూస్తే పోలీసులపై చాలా మందిలో ఉండే చెడు అభిప్రాయం మారిపోతుంది. ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు ఆ పోలీసులు పడ్డ తాపత్రయం చూస్తే సెల్యూట్‌ చేయాలనిపిస్తుంది.

వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు ఆ పోలీసులు పడ్డ తాపత్రయానికి సెల్యూట్‌
Follow us on

మానవత్వం ఇంకా బతికే ఉందని చెప్పడానికి ఆ ఇద్దరు పోలీసులను చూపిస్తే చాలు. వాళ్లిద్దరూ చేసిన పని చూస్తే పోలీసులపై చాలా మందిలో ఉండే చెడు అభిప్రాయం మారిపోతుంది. ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు ఆ పోలీసులు పడ్డ తాపత్రయం చూస్తే సెల్యూట్‌ చేయాలనిపిస్తుంది.

చావు బతుకుల మధ్య కొట్టామిట్టాడుతున్న ఓ వ్యక్తికి సంబంధించిన సమాచారం పోలీసులకు అందింది. అంతే బైక్‌పై హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని రక్షించేందుకు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ చాలాకష్టపడ్డారు. కొంతదూరం అతడ్ని భుజాలపై వేసుకుని పరిగెత్తారు. దాదాపు కిలోమీటరు వరకు పొలాల్లో బురద మధ్య పరుగులు పెట్టారు. ఆ తర్వాత బైక్‌పై హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయినా లాభం లేకపోయింది. అప్పటికే సమయం మించిపోయింది. ఎలాంటి వాహనం వెల్లని చోట నుంచి అతి కష్టం మీద ఆస్పత్రికి తరలించినా.. ప్రాణాలు కాపాడలేక పోయారు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలో జరిగింది.

తెర్లుమద్ది గ్రామానికి చెందిన పండుగు రాజయ్య.. అతని భార్య పై పొలం దగ్గర దాడి జరిగింది. రాజయ్య మేనల్లుడైన పండుగు మల్లేష్ గొడ్డలితో దాడి చేసి పోలీసులకు లొంగిపోయాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై లక్ష్మారెడ్డి కానిస్టేబుల్ రవి సంఘటనా స్థలానికి చేరుకుని రక్తపుమడుగులో మృత్యువుతో పోరాడుతున్న రాజయ్యను భుజాన వేసుకుని ఒక కిలోమీటరు వరకు నడిచారు. ఆ తర్వాత ద్విచక్రవాహనంపై జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. రాజయ్య తలపై తీవ్రమైన గోడ్డలి పోటు ఉండడం వల్ల ఆస్పత్రికి చేర్చే లోపే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

స్థానికుల వివరాల ప్రకారం పండుగ రాజయ్యకు, అతని మేనల్లుడు పండుగ మల్లేష్ కుటుంబాల మధ్య మూడు ఎకరాల భూమికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పంచాయితీ కూడా జరిగింది. అయినా మల్లేష్ తన తీరును మార్చుకోక తరచూ గొడవ పడేవాడిన.. అందులో భాగంగానే.. రాజయ్య, అతని భార్యపై గొడ్డలితో దాడి చేశాడంటున్నారు స్థానికులు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న క్షతగాత్రుడి ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు చేసిన ఈ సాహసాన్ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.