
Singer Sunitha: తెలుగు సింగర్ సునీత పెళ్ళి పనులు మొదలయ్యాయి. బిజినెన్మెన్ రామ్ వీరపనేనితో కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. తాజాగా సునీత ఇంట్లో మెహందీ ఫంక్షన్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సునీత ఫ్రెండ్ నటి రేణూ దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీంతో సునీతకు తన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక రేణుదేశాయ్ షేర్ చేసిన వీడియోలో సునీత పసుపు చీరలో రెండు చేతులకు మెహందీ పెట్టుకోని పెళ్ళికళతో నవ్వుతూ కనపిస్తుంది. నటి రేణుదేశాయ్ మాత్రమే కాకుండా సునీత స్నేహితురాలు యాంకర్ సుమ కూడా ఈ ఫంక్షన్కు హాజరయ్యారు.