Singer Sunitha Instagram Post: ఎన్నో ఏళ్ల ఒంటరి జీవితం తర్వాత ప్రముఖ గాయని సునీత ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సునీత తన జీవితాన్ని మరోసారి కొత్తగా ప్రారంభించారు. శంషాబాద్‌లోని ఒక దేవాలయంలో జరిగిన ఈ వివాహ వేడుకకు చిత్ర సీమతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి.
సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని సునీత వివాహం తర్వాత నుంచి క్రీయాశీలకంగా మారింది. తన వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుందీ సూపర్ సింగర్. ఈ క్రమంలోనే తాజాగా సునీత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. సోఫాలో కూర్చొని వేడి వేడి కాఫీ తాగుతోన్న సమయంలో దిగిన ఓ ఫొటోను షేర్ చేసిన సునీత.. ‘హ్యాపీ కాఫీ టైమ్’ అనే క్యాప్షన్ జోడించింది. వివాహం తర్వాత సునీత పోస్ట్ చేసిన తొలి ఫొటో ఇదే కావడం విశేషం.
Also Read: Kgf chapter 2 climax : కేజీఎఫ్ క్లైమాక్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు..