సింగపూర్‌లో భారతీయుని అరెస్ట్‌

|

Dec 26, 2019 | 5:16 PM

పౌరసత్వ సవరణ చట్టం సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతమయ్యాయి. కేవలం ఇండియాలోనే కాదు. విదేశాల్లోనూ ఆందోళనలకు దిగుతున్నారు భారతీయులు. ఇందులో భాగంగా సింగపూర్‌ మెరీనా బేలో అనుమతి లేకుండా నిరసన తెలుపుతున్న ఓ 32 ఏళ్ల భారతీయుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అక్కడి పోలీసులు. సింగపూర్‌లో పోలీసుల పర్మిషన్‌ లేకుండా బహిరంగ సభను నిర్వహించడం లేదా పాల్గొనడం చట్ట విరుద్ధం. ప్లకార్డులు పట్టుకొని హోటల్‌ క్యాసినో, కన్వెన్షన్‌ సెంటర్‌ మెరీనా బే సాండ్స్‌ సమీపంలో నిరసనకు దిగినట్లు […]

సింగపూర్‌లో భారతీయుని అరెస్ట్‌
Follow us on

పౌరసత్వ సవరణ చట్టం సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతమయ్యాయి. కేవలం ఇండియాలోనే కాదు. విదేశాల్లోనూ ఆందోళనలకు దిగుతున్నారు భారతీయులు. ఇందులో భాగంగా సింగపూర్‌ మెరీనా బేలో అనుమతి లేకుండా నిరసన తెలుపుతున్న ఓ 32 ఏళ్ల భారతీయుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అక్కడి పోలీసులు. సింగపూర్‌లో పోలీసుల పర్మిషన్‌ లేకుండా బహిరంగ సభను నిర్వహించడం లేదా పాల్గొనడం చట్ట విరుద్ధం.

ప్లకార్డులు పట్టుకొని హోటల్‌ క్యాసినో, కన్వెన్షన్‌ సెంటర్‌ మెరీనా బే సాండ్స్‌ సమీపంలో నిరసనకు దిగినట్లు అక్కడి మీడియా కథనాలు ప్రసారం చేసింది. అతను ఆ ఫొటోను తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేసి తర్వాత తొలగించాడు. ఇతర దేశాల రాజకీయ కారణాలను సమర్థించే సమావేశాలకు అక్కడి పోలీసులు అనుమతివ్వరు. సింగపూర్‌లో నివసించే, సందర్శించే విదేశీయులు అక్కడి చట్టాలకు కట్టుబడి ఉండాలని తెలిపారు పోలీసులు.