ఈ సింపుల్ స్టెప్స్‌తో ఇంట్లోనే శానిటైజర్ తయారు చేసుకోండి.. కరోనాను మీ దరిచేరనివ్వకండి.

|

Dec 22, 2020 | 9:50 PM

వ్యాక్సిన్ అందరికీ అందడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలున్న నేపథ్యంలో. కరోనాను అడ్డుకోవడానికి మన దగ్గర ఉన్న అస్త్రాల్లో శానిటైజర్ వినియోగం ఒకటి...

ఈ సింపుల్ స్టెప్స్‌తో ఇంట్లోనే శానిటైజర్ తయారు చేసుకోండి.. కరోనాను మీ దరిచేరనివ్వకండి.
Follow us on

simple steps for home based sanitizer: కరోనా మహమ్మారి తన విజృంభ‌న‌ను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. తాజాగా కరోనా వైరస్ జన్యుమార్పిడి కారణంగా కొత్త రకం వైరస్ మళ్లీ ప్రపంచంపై దాడి చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు ఈ కొత్త రకం వైరస్‌పై యుద్ధం ప్రకటిస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు చేసేది ఎలాగో చేస్తాయి. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాక్సిన్ అందరికీ అందడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలున్న నేపథ్యంలో. కరోనాను అడ్డుకోవడానికి మన దగ్గర ఉన్న అస్త్రాల్లో శానిటైజర్ వినియోగం ఒకటి. ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవడం వల్ల కరోనాను మన దరి చేరకుండా చూసుకోవచ్చు. ఇలాంటి తరుణంలో ఇంట్లోనే సింపుల్‌గా శానిటైజర్‌ను తయారు చేసుకుంటే బాగుంటుంది. కదూ.. మరి ఇంట్లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు లోబడి శానిటైజర్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఓసారి చూద్దాం.

మొదటి విధానం..
Step1: ముందుగా ఒక పాత్ర తీసుకోని అందులో కొద్దిగా రబ్బింగ్ ఆల్కహాల్‌ని వేయాలి. (60 శాతం ఆల్కహాల్ ఉండేలా చూసుకోవాలి)
Step2: అనంతరం అందులో 2 స్పూన్ల అలోవెరా జెల్‌ని కలపాలి.
Step3: ఈ రెండింటిని బాగా కలిపిన తర్వాత అందులో ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి. (ఆయిల్ మీకు నచ్చిన ఫ్లెవర్ తీసుకోవచ్చు)
Step4: ఇలా సిద్ధమైన శానిటైజర్‌ను ఒక బాటిల్‌లో నిల్వచేసుకుని ఉపయోగిస్తే సరిపోద్ది.

రెండో విధానం..
Step1: ముందుగా 100 మి.లీ ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ను శుభ్రమైన పాత్రలో తీసుకోవాలి.
Step2: దీనికి టేబుల్‌ స్పూన్‌ చొప్పున గ్లిజరిన్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలపాలి.
Step3: అనంతరం ఈ ద్రావణానికి 90 మి.లీ శుద్ధమైన నీరు పోయాలి.
Step4: చివరగా ఈ మిశ్రమాన్ని బాగా కలిపి.. బాటిల్‌లో పోసి శానిటైజర్‌గా ఉపయోగించుకోవచ్చు.

అయితే ఇంట్లో శానిటైజర్ తయారు చేసుకునే క్రమంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పదార్థాలను కలిపే పరిమాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్కహాల్ కచ్చితంగా 60 ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఉంటే చర్మానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే తక్కువైతే శానిటైజర్ ఉపయోగముండదు.