Silver Price Today (24-01-2021): కరోనా నేపథ్యంలో భారీగా పెరిగిన వెండి ధర.. మెల్లగా దిగివస్తున్నది

మనదేశంలో మహిళలు బంగారం, వెండి కొనుగోలుకు ఎక్కువ విలువిస్తారు. ప్రతి చిన్న వేడుకలకు ఫంక్షన్లకు వెండి కొనుగోలు చేస్తుంటారు. దీంతో వెండికి ఇండియాలో..

Silver Price Today (24-01-2021):  కరోనా నేపథ్యంలో భారీగా పెరిగిన వెండి ధర.. మెల్లగా దిగివస్తున్నది

Updated on: Jan 24, 2021 | 11:33 AM

Silver Price Today (24-01-2021): మనదేశంలో మహిళలు బంగారం, వెండి కొనుగోలుకు ఎక్కువ విలువిస్తారు. ప్రతి చిన్న వేడుకలకు ఫంక్షన్లకు వెండి కొనుగోలు చేస్తుంటారు. దీంతో వెండికి ఇండియాలో భారీ డిమాండ్ ఉంటుంది. ఇక, బులియన్ మార్కెట్‌లో జనవరి చివరి వారంలో బంగారం ధరల బాటలోనే వెండి ధరలు సైతం పయణిస్తున్నాయి. జనవరి రెండో వారం భారీగా పెరిగిన వెండి ధరలు తాజాగా దిగివచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు పతనమయ్యాయి

తాజాగా రూ.50 తగ్గి ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.71,350లకు చేరుకుంది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.570.80 ఉంది. కరోనా అనంతరం గత సంవత్సరం ఆగస్ట్ 7న అత్యధిక ధరకు చేరిన వెండి ఆ రోజున కేజీ 76,510గా ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ 24 వరకూ తగ్గుతూ ఆ రోజున కనిష్టంగా కేజీ రూ.57,000కి పడిపోయింది.

ఢిల్లీలో వెండి ధర రూ.600 మేర పతనమైంది. నేడు 1 కేజీ వెండి ధర రూ.66,800 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.1,100 మేర దిగొచ్చింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.71,350కు పతనమైంది.

Also Read: దిగివస్తున్న బంగారం ధర..నగలు కొనుక్కోవాలనుకునేవారికి ఇది సరైన సమయమేనా