చలి గుప్పిట్లో ఉత్తరాది.. రాజస్థాన్‌లో మరీ దారుణం!

ఉత్తర భారతం చలి గుప్పిట్లో గజగజలాడుతోంది. పట్టణాలను మంచు దుప్పట్లు కమ్మేస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్ లో మంగళవారం అతి శీతల వాతావరణం నెలకొంది. సికర్.. రాష్ట్రంలోనే అతి శీతల ప్రదేశంగా నిలిచింది, మంగళవారం ఇక్కడ 1 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గంగానగర్ లో 2.1 డిగ్రీలు, జైపూర్, బికనీర్ 2.7 డిగ్రీలుగా నమోదయ్యాయి. పిలాని, అజ్మీర్, చురు, డాబోక్, కోటా, బార్మెర్, జోధ్‌పూర్‌లు […]

చలి గుప్పిట్లో ఉత్తరాది.. రాజస్థాన్‌లో మరీ దారుణం!

Edited By:

Updated on: Jan 01, 2020 | 12:59 PM

ఉత్తర భారతం చలి గుప్పిట్లో గజగజలాడుతోంది. పట్టణాలను మంచు దుప్పట్లు కమ్మేస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్ లో మంగళవారం అతి శీతల వాతావరణం నెలకొంది. సికర్.. రాష్ట్రంలోనే అతి శీతల ప్రదేశంగా నిలిచింది, మంగళవారం ఇక్కడ 1 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గంగానగర్ లో 2.1 డిగ్రీలు, జైపూర్, బికనీర్ 2.7 డిగ్రీలుగా నమోదయ్యాయి. పిలాని, అజ్మీర్, చురు, డాబోక్, కోటా, బార్మెర్, జోధ్‌పూర్‌లు కూడా వరుసగా కనిష్టంగా 2.8, 3.1, 3.6, 5, 5.7, 6.2, 7.7 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

[svt-event date=”01/01/2020,12:51PM” class=”svt-cd-green” ]