కరోనా రక్కసి అడ్డుకోవాలంటే ఒక్కటే ఆయుదం అదే మాస్క్. సామాన్య ప్రజానీకంతోపాటు సెలబ్రిటీలు కూడా ఖచ్చితంగా ఫేస్ మాస్క్ ధరిస్తున్నారు. ఫేస్ మాస్కు అవసరాన్ని ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవితోపాటు పలువురు ప్రముఖలు ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు తాజాగా శృతిహాసన్ తనదైన తరహాలో ఫోటోలకు ఫోజులిచ్చింది.
ప్రాముఖ్యతను తెలియజేస్తూ అందాల భామ శృతిహాసన్ గోల్డ్ ఫేస్ మాస్క్ తో మెరిసిపోయింది. ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీపై శృతిహాసన్ ఫొటో ఇపుడు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. మెడలో బంగారు చైన్లు, గోల్డ్ చైన్స్ అల్లికతో తయారు చేసిన మాస్క్..నుదిటిన పాపిడి బిల్లతో కనిపిస్తున్న శృతిహాసన్ ఫొటో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది.