దొంగ పని ఖతం.. రష్యాలో ఏం జరిగిందంటే ?

|

Dec 30, 2019 | 5:57 PM

అది రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో గల ఓ మొబైల్ షాప్.. మొబైల్స్ ఫోన్స్ సేల్స్ లేక.. కస్టమర్లు రాక ఆ షాప్ లోని మేనేజర్, ఇతర సిబ్బంది ఉసూరుమంటూ.. దిగాలుగా కూర్చున్న వేళ..ముఖానికి మాస్క్ ధరించిన ఓ దొంగ ఓ చేతిలో గన్, మరో చేతిలో గ్రెనేడ్ పట్టుకుని నింపాదిగా షాప్ లోకి ఎంటరయ్యాడు. మర్యాదగా మొబైల్ ఫోన్లను, గత వారం అమ్మకాల తాలూకు సొమ్మును ఇచ్ఛేయ్యాలని, లేకుంటే గన్ తో షూట్ చేయడమే […]

దొంగ పని ఖతం.. రష్యాలో ఏం జరిగిందంటే ?
Follow us on

అది రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో గల ఓ మొబైల్ షాప్.. మొబైల్స్ ఫోన్స్ సేల్స్ లేక.. కస్టమర్లు రాక ఆ షాప్ లోని మేనేజర్, ఇతర సిబ్బంది ఉసూరుమంటూ.. దిగాలుగా కూర్చున్న వేళ..ముఖానికి మాస్క్ ధరించిన ఓ దొంగ ఓ చేతిలో గన్, మరో చేతిలో గ్రెనేడ్ పట్టుకుని నింపాదిగా షాప్ లోకి ఎంటరయ్యాడు. మర్యాదగా మొబైల్ ఫోన్లను, గత వారం అమ్మకాల తాలూకు సొమ్మును ఇచ్ఛేయ్యాలని, లేకుంటే గన్ తో షూట్ చేయడమే గాక..గ్రెనేడ్ కూడా వేసి పేల్చేస్తానని సిబ్బందిని హెచ్ఛరించాడు.

అసలే అమ్మకాలు లేక తామేడుస్తుంటే..వీడెవడో వఛ్చి తమను బెదిరిస్తున్నాడని ఆగ్రహించిన ఆ షాప్ లోని మహిళా మేనేజర్ ధైర్యంగా చటుక్కున గెంతి.. అతని చేతిలోని పిస్టల్ లాక్కుని అతనికే గురి పెట్టింది. ఇంతలో మరో ఉద్యోగి.. మంటల్ని ఆర్పే సిలిండర్ తో ఒక్కసారిగా ఆ దొంగ మీదికి పొగను వదిలాడు.

పైగా ఓ చైర్ ని కూడా అతనిమీదికి విసిరేశాడు. ఆ ఘాటైన పొగకు ఉక్కిరిబిక్కిరైన దొంగ గారు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా.. మన ‘ హీరోలు ‘ డేంజర్ అలారం మోగించడంతో.. బిలబిలమంటూ పోలీసులు వచ్చి అతడ్ని అరెస్టు చేశారు. ఇదంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. అన్నట్టు ఈ దోపిడీ దొంగ సామాన్యుడు కాడట. చైనీస్ మేడ్ కారులో ఈ దొంగతనానికి వచ్చాడట.. ఆ కారులో సెర్చ్ చేయగా… కొన్ని ఫేక్, కొన్ని రియల్ ఆయుధాలు చూసి పోలీసులు షాక్ తిన్నారు.. మొత్తానికి వివిధ సెక్షన్ల కింద ఆయనగారిని అరెస్టు చేసి తీసుకుపోయారు.